ఫేమస్ స్పోర్స్ట్ కోచ్, పరుగుల రాణి పీటీ ఉష మాజీ కోచ్ ఓ.ఎమ్ నంబియార్ గురువారం కేరళ కోజికొడ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.
పలు అంతర్జాతీయ పోటీల్లో పీటీ ఉష ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో నంబియార్ వెలుగులోకి వచ్చారు. ఆయన ప్రేరణతోనే తాను విజయం సాధించిందని పీటీ ఉష అనేక సందర్భాల్లో వెల్లడించింది.
దేశంలో ఉత్తమ కోచ్‌గా నంబియార్‌కు గౌరవం దక్కింది. ఈ మేరకు ద్రోణాచార్య అవార్డు లభించింది. 2021లో ఆయన్ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం.
వణుకు రోగం(పర్కిన్సన్స్)తో నంబియార్ గత కొన్ని రోజులుగా బాధపడుతున్నారని పీటీ ఉష తెలిపింది. 10 రోజుల క్రితమే ఆయనకు గుండెపోటు కూడా వచ్చిందని పేర్కొంది. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నంబియార్ తనకు తండ్రి సమానుడని తెలిపింది.
ఇదీ చదవండి: రషీద్ ఖాన్ ట్వీట్.. ఎంత ఆవేదనతో చేశాడో!