ETV Bharat / sports

PM Modi: వేలంలో నీరజ్ జావెలిన్, సింధు రాకెట్​, లవ్లీనా గ్లోవ్స్

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన భారత అథ్లెట్ల క్రీడా వస్తువులను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే నీరజ్​ చోప్డా జావెలిన్​, లవ్లీనా బాక్సింగ్ గ్లోవ్స్​, పీవీ సింధు రాకెట్​ను ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ​తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు 16న మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఈ ప్రతిపాదన తెచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : Aug 21, 2021, 2:01 PM IST

Updated : Aug 21, 2021, 2:06 PM IST

ఒలింపిక్స్‌కు ముందు, తర్వాత భారత క్రీడాకారుల్లో ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) ఉత్సాహం నింపారు. మొదట పతకాలు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించిన మోదీ.. వారు తిరిగొచ్చాక వారి ఆటతీరును ప్రశంసించారు. కాగా ఆయన మరో మంచి పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్​ గోల్డ్​ మెడలిస్ట్​ నీరజ్‌ చోప్డా జావెలిన్‌, కాంస్యాలు సాధించిన లవ్లీనా బాక్సింగ్‌ గ్లోవ్స్‌, పీవీ సింధు రాకెటును వేలం వేయనున్నారని సమాచారం.

ఆగస్టు 16న ఒలింపిక్స్‌ క్రీడాకారులకు ప్రధాని మోదీ తన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ప్రతి క్రీడాంశానికి చెందిన అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పతకాలు తెచ్చినవారినే కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారిని, మెగా క్రీడల్లో ఆడిన అథ్లెట్లను అభినందించారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం సింధుకు ఐస్‌క్రీం, నీరజ్‌కు చుర్మా తినిపించారు. అదే సమయంలో వారి వద్ద వేలం ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తోంది.

నీరజ్‌ చోప్డా తన బళ్లెం మోదీకి చూపించాడు. అప్పుడు 'నువ్వు దీనిపై సంతకం చేశావు. నేను దీన్ని వేలం వేస్తాను. ఇబ్బందేం లేదుగా?' అని ప్రధాని అతడితో అన్నారు. చిరునవ్వుతో స్పందించిన నీరజ్‌.. తన జావెలిన్‌ను మోదీకి బహుకరించాడు. అంతే కాకుండా పీవీ సింధు తన రాకెట్‌ను ఇచ్చింది. బాక్సర్ లవ్లీనా నుంచి ప్రధాని బాక్సింగ్‌ గ్లోవ్స్‌ తీసుకున్నారు. 'నేనిప్పుడు వీటిని ధరిస్తే, మోదీ తమనేమో చేయబోతున్నారని రాజకీయ నాయకులు అంటారు' అని అప్పుడు మోదీ చమత్కరించారు. ఇవి మాత్రమే కాకుండా మిగతా క్రీడాకారుల నుంచీ ఆయన సేకరించిన వస్తువులను వేలం వేస్తారని అంటున్నారు.

ఇదీ చదవండి: ఆర్మీ స్టేడియానికి ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్డా​ పేరు!

Last Updated : Aug 21, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.