భారత 15 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి అంతర్జాతీయ టోర్నీలో మెరిశాడు. జులియస్ బార్ ఛాలెంజర్స్ ఆన్లైన్ చెస్ టూర్లో భాగంగా జరుగుతున్న పొల్గార్ ఛాలెంజ్ టోర్నీలో ఆదివారం అతను విజేతగా నిలిచాడు.
టోర్నీలో మరో రౌండ్ మిగిలే ఉన్నప్పటికీ తొలి మూడు రౌండ్లలో విజయాలు సాధించిన ప్రజ్ఞానందను టైటిల్ వరించింది. ఈ విజయంతో సుమారు రూ.2.24 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు ప్రజ్ఞ. దీంతోపాటు అత్యుత్తమ ప్లేయర్లు తలపడే మెల్ట్‌వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్‌కు అతను అర్హత సాధించాడు. ఈ నెల 24న ఆ టోర్నీ జరగనుంది.