ETV Bharat / sports

ఒలింపిక్స్​ను వద్దంటున్న 60 శాతం మంది! - టోక్యో ఒలింపిక్స్​

ఇప్పటికే ఏడాది వాయిదా పడ్డ ఒలింపిక్స్​ను ఈ సారి కూడా వాయిదా లేదా రద్దు చేయడానికే జపాన్​లోని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. అక్కడ కరోనా సెకండ్​ వేవ్​ విజృంభించడమే ఇందుకు కారణం.

Olympics
టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : May 10, 2021, 8:11 PM IST

టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని లేదా రద్దు చేయాలని జపాన్‌లో అత్యధికులు కోరుకుంటున్నారని తెలిసింది. స్థానిక మీడియా నిర్వహించిన సర్వేల్లో 60% ప్రజలు రద్దు/వాయిదాకే మొగ్గు చూపుతున్నారు. 30% మందికి పైగా క్రీడల్ని నిర్వహించాలని అంటుండగా, అభిమానులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని చెప్పారు.

కరోనా కారణంగా ప్రస్తుతం జపాన్‌లోని నగరాలు, పట్టణాల్లో కొవిడ్‌ అత్యయిక పరిస్థితిని పొడిగించారు. వైరస్‌ సంక్షోభంతో గతేడాది జరగాల్సిన మెగా క్రీడలు వాయిదా పడ్డాయి. ఈసారీ ముందుకెళ్లే పరిస్థితి లేనప్పటికీ క్రీడల్ని కచ్చితంగా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వదేశీ అభిమానులను అనుమతించే విషయంపై సందిగ్ధం నెలకొంది.

మే 7 నుంచి 9 వరకు యోమియురి షింబున్‌ డైలీ నిర్వహించిన సర్వేలో 59% మంది క్రీడలను రద్దు/వాయిదా వేయాలని ఓటేశారు. 39% మంది మాత్రం అందుకు వ్యతిరేకించారు. వాయిదా సరైన నిర్ణయం కాదన్నారు. అందులో 23% మంది మాత్రం అభిమానులు లేకుండా ఒలింపిక్స్‌ నిర్వహించాలని అన్నారు. టీబీఎస్‌ న్యూస్‌ నిర్వహించిన మరో పోల్‌లోనూ 65% వాయిదా/రద్దుకే మొగ్గు చూపారు. ఏప్రిల్‌లోనూ క్యోడో న్యూస్‌ నిర్వహించిన సర్వేలో 73% మంది ప్రజలు వాయిదాకే ఓటేయడం గమనార్హం.

ఇదీ చూడండి: 'కరోనా విజృంభిస్తుంటే ఒలింపిక్స్​ అవసరమా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.