ETV Bharat / sports

ఫిట్​నెస్​, స్పోర్ట్స్​పై నీరజ్ పాఠాలు.. మోదీ ప్రశంస

Neeraj Chopra Modi: గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్డా.. ఓ కార్యక్రమం ద్వారా విద్యార్థులను ప్రత్యేకంగా కలిసి స్టోర్ట్స్​, ఫిట్​నెస్​పై వారికి అవగాహన కల్పించాడు. ఈ కార్యక్రమం చాలా గొప్పదని ప్రధాని మోదీ ప్రశంసించారు.

modi, neeraj chopra
మోదీ, నీరజ్ చోప్డా
author img

By

Published : Dec 5, 2021, 3:27 PM IST

Neeraj Chopra Modi:టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డాపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నీరజ్​ చేపట్టిన కార్యక్రమాల వల్ల యువతలో వ్యాయామంపై, క్రీడలపై మరింత ఆసక్తి పెరుగుతుందని కొనియాడారు.

డైట్​, ఫిట్​నెస్​, స్పోర్ట్స్​పై విద్యార్థులు, అథ్లెట్స్​లో అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాడు టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ పతక విజేత నీరజ్​ చోప్డా. అహ్మదాబాద్ సంస్కార్థామ్​ స్కూల్​ వేదికగా జరిగిన ఈ కార్యకమానికి 75 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వారితో కలిసి వివిధ ఆటలు ఆడిన నీరజ్​.. జావెలిన్​ త్రోకు సంబంధించి కొన్ని టిప్స్​ చెప్పాడు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

  • This thread will make you happy.

    Let us keep up the momentum and inspire our youth to shine on the games field. https://t.co/1lWgRitoZP

    — Narendra Modi (@narendramodi) December 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"యువత పలు క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేసేలా ప్రోత్సహిద్దాం. నీరజ్​ చోప్రా ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా గొప్పది. విద్యార్థుల వద్దకు వెళ్లి ఫిట్​నెస్​, డైట్ మొదలైన అంశాలపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. ఇలా ప్రోత్సహిస్తే యువతరం క్రీడలపై ధ్యాసపెడుతుంది." అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

National sports awards: నీరజ్​కు 'ఖేల్​రత్న'.. ధావన్​కు 'అర్జున'

ఆ స్కూల్​ విద్యార్థులకు నీరజ్​ చోప్రా స్పెషల్ క్లాస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.