ETV Bharat / sports

సెయిలర్ నేత్ర రికార్డు.. ఒలింపిక్స్​కు మరో ముగ్గురు

author img

By

Published : Apr 8, 2021, 6:04 PM IST

భారత సెయిలర్ నేత్ర సరికొత్త ఘనత సాధించింది. ఒలింపిక్స్​లో సెయిలింగ్​లో పోటీపడనున్న తొలి మహిళ క్రీడాకారిణిగా నిలిచింది.

Nethra Kumanan first Indian woman sailor to qualify for Olympics
నేత్ర కుమ్మన్

ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి మహిళ సెయిలర్​గా నేత్రా కుమనన్(తమిళనాడు) చరిత్ర సృష్టించింది. ఒమన్​లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్​లోని లేజర్ రేడియల్ క్లాస్​ ఈవెంట్​లో పోటీ పడిన ఈమె.. బుధవారం పోటీల్లో 21 పాయింట్లతో టాప్​లో నిలిచింది. దీంతో తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్​కు అర్హత సాధించింది.

నేత్రాతో పాటు మన దేశం నుంచి మరో ముగ్గురు, సెయిలింగ్​ పోటీల కోసం ఒలింపిక్స్​కు వెళ్లనున్నారు. వీరిలో విష్ణు శరవణన్, గణపతి చెంగప్ప-వరుణ్ తక్కర్ జోడీ ఉంది.

ఇప్పటివరకు సెయిలింగ్​లో ఒలింపిక్స్​కు ప్రాతినిధ్యం వహించిన వారిలో తొమ్మిది మంది పురుషులే ఉండగా, మెగా క్రీడల్లో పాల్గొనున్న తొలి మహిళ సెయిలర్​గా నేత్ర నిలవనుంది.

కరోనా ప్రభావంతో గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్​ను.. సంవత్సరం వాయిదా వేశారు. దీంతో ఈ ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో పోటీలు జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.