ETV Bharat / sports

ఎవరెస్టు ఎక్కకుండానే.. ఎక్కానని చెప్పి! - భారతీయులపై నేపాల్​ వేటు

ఎవరెస్టు ఎక్కినట్లుగా తప్పుడు ఆధారాలు చూపి.. అవార్డు కొట్టేయాలనుకున్నాడు ఓ పర్వతారోహకుడు. దీన్ని అధికారులు పసిగట్టారు. అతనితో పాటు అబద్ధాలు చెప్పిన మరో ఇద్దరు పర్వతారోహకులపై కూడా వేటు వేశారు.

Nepal bans three Indian climbers
ఎవరెస్టు ఎక్కకుండానే.. ఎక్కానని చెప్పి
author img

By

Published : Feb 11, 2021, 7:17 PM IST

కష్టపడకుండానే ఫలితం అనుభవించాలనుకున్నారు కొందరు వ్యక్తులు. అయితే వారి ప్రణాళికలను అధికారులు భగ్నం చేశారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించానని తనను.. టెన్సింగ్​ నార్గే అవార్డుకు ఎంపిక చేయాలని 2020లో కేంద్రాన్ని పర్వతారోహకుడు నరేందర్‌ సింగ్‌ యాదవ్‌ కోరాడు. అయితే అతడి విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు క్రీడా మంత్రిత్వశాఖ తెలిపింది. పర్వాతారోహకుడు సమర్పించిన ధ్రువపత్రాలన్ని పరిశీలించిన పిదప.. అవన్నీ నకిలీగా తేలినట్లు పేర్కొంది. ఎవరెస్ట్‌పై దిగినట్లు పంపిన ఫొటోలను సంబంధిత పత్రాలను నిపుణులు బృందం పరిశీలించగా.. నకిలీగా తేలినట్లు కేంద్రం తెలిపింది.

నేపాల్​ నిషేధం..

యాదవ్‌తో పాటు తోటి పర్వతాధిరోహకురాలు సీమా రాణి, వారి టీమ్​ లీడర్​ నభా కుమార్​ ఫుకాన్​లపై నేపాల్‌ ప్రభుత్వం ఆరేళ్లపాటు నిషేధించింది. పర్వతారోహణ చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. అలాగే నకిలీ పత్రాలు చూపి వరల్డ్‌ హైయస్ట్‌ సమ్మిట్‌-2016లో పొందిన ధ్రువపత్రాలను రద్దు చేసినట్లు బుధవారం ప్రకటించింది.

ఇదీ చదవండి:మహమ్మారిని తరిమికొట్టేందుకు 'హోరాబేదు' ఉత్సవం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.