ETV Bharat / sports

అందుకే టీటీ కుటుంబానికి సాయం: నేహా

లాక్​డౌన్ వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న టేబుల్​ టెన్నిస్​ ఆటగాళ్లను ఆదుకునేందుకు ముందుకొచ్చింది మాజీ క్రీడాకారిణి నేహా అగర్వాల్​. దీంతో పాటు యువ ఆటగాళ్లకు పలు సూచనలు చేసింది.

nehaagarwal
నేహా అగర్వాల్​
author img

By

Published : Jul 4, 2020, 10:04 AM IST

Updated : Jul 4, 2020, 10:18 AM IST

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న టేబుల్​ టెన్నిస్​ ఆటగాళ్లు, కోచ్​లకు అండగా నిలిచేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లు శరత్​ కమల్​, సత్యన్​లతో కలిసి మాజీ క్రీడాకారిణి నేహా అగర్వాల్​ చేపట్టిన కార్యక్రమానికి గొప్ప స్పందన వస్తోంది. అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తంలోనే విరాళాలు సేకరించామని నేహా చెబుతోంది. టీటీపై కరోనా ప్రభావం.. యువ ఆటగాళ్లకు సూచనలు తదితర విషయాలను ఈ మాజీ ఒలింపియన్​ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

neha agarwal
నేహా అగర్వాల్​

"కరోనా క్రీడారంగాన్ని గట్టి దెబ్బ కొట్టింది. టేబుల్​ టెన్నిస్​ పైనా ఆ ప్రభావం పడింది. కేవలం ఆటనే నమ్ముకుని చాలా మంది కోచ్​లున్నారు. ఆర్థిక భారం మోయలేని వర్ధమాన ఆటగాళ్లున్నారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందుల్లో ఉన్న అలాంటి వారికి సాయంగా నిలవడం కోసమే విరాళాల సేకరణ కార్యక్రమాన్ని మొదలెట్టాం. ఇప్పటికే ఓ ఎన్​జీవోతో కలిసి హాకీ ఆటగాళ్లకు ఆర్థిక సాయం అందించాం. అదే విధంగా టీటీలో చేయాలని అనుకున్నా. అప్పుడే చెన్నైలో శరత్​, సత్యన్​ కలిసి కొంతమంది కోచ్​లకు అండగా నిలవాలనుకుంటున్నట్లు తెలిసింది. వీలైనంత ఎక్కువ మందికి సాయం చేద్దామని వాళ్లతో మాట్లాడా. వాళ్లు కూడా సరే అనడం వల్ల విరాళాల సేకరణ ప్రారంభించాం."

"గత నెల 23 నుంచి ఇప్పటివరకు పోగైన డబ్బుతో దాదాపు 150మందికి సాయం చేయగలం. ఆదివారం విరాళాల సేకరణ ముగిస్తాం. అప్పుడే మొత్తం ఎంత డబ్బు వచ్చింది, దాంతో ఎంత మందికి సాయం అందించగలమో తెలుస్తుంది. ఎంపిక చేసిన వాళ్లలో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పు న ఇవ్వాలి అనుకుంటున్నాం. శరత్​, సత్యన్​ ఈ కార్యక్రమం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు, వ్యాపార సంస్థలను విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరాం. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఎవరో ఒకరు ముందుకు వచ్చి కష్టాల్లో ఉన్న ప్లేయర్లను ఆదుకోవాలి. ఆ బాధ్యత మేం తీసుకున్నాం. ఆట నాకు జీవితాన్నిచ్చింది. అలాంటి ఆటకు తిరిగి ఇవ్వాలి కదా! దిల్లీకి చెందిన నేను 18ఏళ్లకే ఒలింపిక్స్​ (2008 బీజింగ్​)లో ప్రాతినిధ్యం వహించా. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సౌకర్యాలు, వసతులు మెరుగయ్యాయి. శిక్షణ విధానానికి సాంకేతికత తోడైంది. అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు గొప్పగా రాణిస్తున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే ఒలింపిక్స్​ పతకం సాధించడం అసాధ్యమేమీ కాదు. అయితే కరోనా వల్ల ఆటకు ఇంతకాలం దూరంగా ఉండటం అథ్లెట్లకు మంచిది కాదు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు" అని నేహా తెలిపింది.

ఇది చూడండి : జీతాలు తగ్గిస్తే అడ్డదారి తొక్కుతారేమో!

Last Updated : Jul 4, 2020, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.