Neeraj Chopra Wins Gold World Athletics Championships 2023 : ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత చరిత్ర తిరగరాస్తూ.. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని ముద్దాడిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఇప్పుడు మరో సంచలనం సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ భారత అథ్లెట్‌కు సాధ్యం కాని ప్రపంచ ఛాంపియన్ హోదాను నీరజ్ అందుకున్నాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో ఒకే ఒక్క త్రోతో ఫైనల్‌కు దూసుకెళ్లిన అతడు.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాడు. మొదటి ప్రయత్నంలోనే ఫెయిల్ అయినా.. రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన నీరజ్.. ఈ బంగారు పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు.
అయితే నీరజ్ గతంలో పలు పోటీల్లో గెలిచి చాలా రికార్డులు సృష్టించినప్పటికీ.. ఇప్పటివరకు తన బల్లెంను 90 మీటర్ల దూరాన్ని విసరలేకపోయాడు. చాలా సార్లు దీనిపై సోషల్‌మీడియాలో చర్చ కూడా జరిగింది. తాను కూడా 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడుతున్నట్లు నీరజ్ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌ఫిప్ విజయం గురించి మాట్లాడుతూ.. తన 90 మీటర్ల లక్ష్యం గురించి కూడా స్పందించాడు. త్వరలోనే కచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.
-
.@Neeraj_chopra1 brings home a historic gold for India in the javelin throw 👏#WorldAthleticsChamps pic.twitter.com/YfRbwBBh7Z
— World Athletics (@WorldAthletics) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@Neeraj_chopra1 brings home a historic gold for India in the javelin throw 👏#WorldAthleticsChamps pic.twitter.com/YfRbwBBh7Z
— World Athletics (@WorldAthletics) August 27, 2023.@Neeraj_chopra1 brings home a historic gold for India in the javelin throw 👏#WorldAthleticsChamps pic.twitter.com/YfRbwBBh7Z
— World Athletics (@WorldAthletics) August 27, 2023
"ప్రతి ఒక్కరు అంటుంటారు ఈ మెడల్ ఇంకా మిగిలి ఉందని. అది ఈ రోజు తీరిపోయింది. ఇంకా 90 మీటర్ల లక్ష్యం మాత్రం మిగిలి ఉంది. భవిష్యత్ పోటీల్లో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను. అన్నీ త్రోలను కాన్ఫిడెంట్‌తోనే విసిరాను. నిలకడగానే వేశాను. మొదటి ప్రయత్నంలో బాగానే విసిరాను.. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ త్రో మిస్ అయింది. మళ్లీ నన్ను నేను పుష్ చేసుకుని ప్రయత్నించాను. ఈ మెడల్ ప్రతి భారతీయుడిది. దేశానికి అంకితమిస్తున్నాను" అని నీరజ్ పేర్కొన్నాడు.
-
Neeraj Chopra ♥️🇮🇳🔥
— Kameshhhhhh (@kameshhhhhhh) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
.
Olympics 🥇
World Athletics Championships 🥇
Commonwealth Games 🥇
Asian Games 🥇
Asian Championships 🥇
South Asian Games 🥇
Diamond League 🥇
World Junior Championships 🥇
💙💙💙#NeerajChopra #JavelinThrow #javelin #arshadnadeem #india #pakistan… pic.twitter.com/Jafg8xMC82
">Neeraj Chopra ♥️🇮🇳🔥
— Kameshhhhhh (@kameshhhhhhh) August 27, 2023
.
Olympics 🥇
World Athletics Championships 🥇
Commonwealth Games 🥇
Asian Games 🥇
Asian Championships 🥇
South Asian Games 🥇
Diamond League 🥇
World Junior Championships 🥇
💙💙💙#NeerajChopra #JavelinThrow #javelin #arshadnadeem #india #pakistan… pic.twitter.com/Jafg8xMC82Neeraj Chopra ♥️🇮🇳🔥
— Kameshhhhhh (@kameshhhhhhh) August 27, 2023
.
Olympics 🥇
World Athletics Championships 🥇
Commonwealth Games 🥇
Asian Games 🥇
Asian Championships 🥇
South Asian Games 🥇
Diamond League 🥇
World Junior Championships 🥇
💙💙💙#NeerajChopra #JavelinThrow #javelin #arshadnadeem #india #pakistan… pic.twitter.com/Jafg8xMC82
Neeraj Chopra Gold Medal Throw Distance : క్వాలిఫయర్స్‌లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల దూరం బల్లెం విసిరి నేరుగా విసిరి తుదిపోరుకు దూసుకెళ్లాడు నీరజ్. అయితే ఈ ఫైనల్ మొదటి ప్రయత్నంలో అతడు విఫలమవ్వగా.. రెండో ప్రయత్నంలో తేరుకుని బల్లెంను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత ప్రయత్నాల్లోనూ 86.32, 84.64, 87.73, 83.98 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని కొనసాగించాడు. ఇక నీరజ్‌తో పాటు ఈ తుది పోరులో పోటీపడ్డ భారత అథ్లెట్స్ కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానంలో, డీపీ మను 84.14 మీటర్లతో ఆరో స్థానంలో నిలిచారు. పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్‌ను ముద్దాడగా.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వడ్లెచ్ 86.67 మీటర్ల విసిరి కాంస్యం అందుకున్నాడు.
Neeraj Chopra Paris Olympics : నీరజ్ చోప్రా భళా.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత
డైమండ్ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా.. అగ్రస్థానం కైవసం