ETV Bharat / sports

ఖేల్​రత్నకు స్టార్​ ప్లేయర్​ నీరజ్ చోప్రా

జావెలిన్​ త్రో ప్లేయర్​ నీరజ్​ చోప్రా​ పేరును ఖేల్​రత్నకు సిఫార్సు చేసింది భారత అథ్లెటిక్స్​​ సమాఖ్య. అర్జున అవార్డు కోసం ద్యుతీ చంద్​, అర్పిందర్​ సింగ్​, మంజిత్ సింగ్,​ పీయూ చిత్ర పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.

neeraj chopra
నీరజ్​ చోప్రా​
author img

By

Published : Jun 3, 2020, 6:15 PM IST

భారతదేశ అత్యున్నత పురస్కారం ఖేల్​రత్నకు జావెలిన్​ త్రో ఆటగాడు నీర​జ్​ చోప్రాను నామినేట్ చేసింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఈ అవార్డు ఇతడు నామినేట్ కావడం వరుసగా ఇది మూడోసారి. ఇంతకుముందు 2018లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించి, అదే ఏడాది అర్జున్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించి, వాటి కోసం ప్రిపేర్ అవుతున్నాడు.

ఇతడితో పాటే ఈ ఏడాది అర్జున అవార్డులకు మహిళా రన్నర్​ ద్యుతీ చంద్​, ​ అర్పిందర్​ సింగ్ (ట్రిపుల్​ జంప్)​, మంజిత్​ సింగ్(800 మీటర్లు)​, ఆసియా ఛాంపియన్​, మిడిల్​ డిస్టెన్స్​ రన్నర్​ పీయూ చిత్ర పేర్లను నామినేట్ చేశారు.

ఇదీ చూడండి : మేరీకోమ్​తో వివాదంపై యువ బాక్సర్ నిఖత్ స్పందన​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.