ETV Bharat / sports

ఈ ఏడాదే ఆ ప్రశ్నకు చెక్​ పెడతా: నీరజ్ చోప్రా

author img

By

Published : Mar 6, 2023, 5:09 PM IST

జావెలిన్​ త్రోలో తన 90 మీటర్ల లక్ష్య ఛేదన ప్రశ్నకు ఈ ఏడాదే చెక్​ పెడతానని ఒలింపిక్​ జావెలిన్​ త్రో ఛాంపియన్​ నీరజ్​ చోప్రా చెప్పాడు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల అండర్​-19 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత క్రికెట్​ జట్టుతో ముచ్చటించిన నీరజ్​ చోప్రా.. ఈ విషయంపై మాట్లాడాడు.

neeraj chopra latest news
నీరజ్​ చోప్రా తాజా వార్తలు

90 మీటర్ల జావెలిన్​ త్రో మార్క్​ను ఎప్పుడు సాధిస్తారు అనే ప్రశ్నకు ఈ ఏడాదే సమాధానం చెబుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు ఒలింపిక్​ జావెలిన్​ త్రో ఛాంపియన్​ నీరజ్​ చోప్రా. ఒలింపిక్​లో స్వర్ణం గెలుచుకున్న నీరజ్​.. గట్టి పోటీ ఉండే ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రజతాన్ని ముద్దాడాడు. అంతేగాక గతేడాది స్వీడన్​లో జరిగిన డైమండ్​ లీగ్​ టైటిల్​నూ కైవసం చేసుకున్నాడు నీరజ్​. కెరీర్​లో ఎన్నో మైలు రాళ్లను చేరుకున్న నీరజ్​ను ఎప్పుడు వెంటాడే ప్రశ్న.. 'నీరజ్​ ఎప్పుడు 90 మీటర్ల త్రోను విసురుతాడు'..? అయితే తాజాగా దీనికి బదులిచ్చాడు నీరజ్ చోప్రా​​. ఈ ఏడాదే ఈ ప్రశ్నకు ముగింపు పలుకుతానని స్పష్టం చేశాడు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల అండర్​-19 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత క్రికెట్​ జట్టుతో ముచ్చటించిన నీరజ్​ చోప్రా.. ఈ విషయంపై మాట్లాడాడు.

"ఈ సంవత్సరమే నేను 90 మీటర్ల మార్క్​ను అధిగమిస్తాను. దీనిని మీరు ఎప్పుడు ఛేదిస్తారని నన్ను చాలా మంది చాలా సార్లు నన్ను అడిగారు. అయితే ఈ ఏడాదే ఆ ప్రశ్నకు సమాధానం చెబుతానని అనుకుంటున్నాను."

--నీరజ్​ చోప్రా, ఒలింపిక్​ జావెలిన్​ ఛాంపియన్

ఇదే అత్యుత్తమం..
గతేడాది జూన్‌లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్‌లో అత్యధిక దూరం విసిరాడు నీరజ్​ చోప్రా. 89.94 మీటర్లు విసిరిన ఈ త్రోను కెరీర్​లోనే అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు.

2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్​లో ఆడలేకపోయాడు ఈ స్టార్ ఇండియన్ జావెలిన్ త్రోయర్‌. అయితే ఈ ఏడాది సెప్టెంబర్​లో చైనాలోని హాంగ్‌జౌలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో అతడి ఆటని చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించే నీరజ్​ చోప్రా దక్షిణాఫ్రికాలో కఠోర శ్రమ చేస్తున్నాడు. దీంతో అతడిపై అంచనాలను భారీగానే పెట్టుకున్నారు ఫ్యాన్స్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.