ETV Bharat / sports

జాతీయ క్రీడా అవార్డులు ఎన్ని ఉంటాయి..? - Maulana Abul Kalam Azad Trophy

ఆగస్టు 29 అంటే నేడు.. భారత హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ పుట్టినరోజు. ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకొంటాం. క్రీడల్లో భారత ఆటగాళ్లు చూపిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ఇస్తుంది. ఆ అవార్డులు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం..

జాతీయ క్రీడా అవార్డులు ఎన్ని ఉంటాయి..?
author img

By

Published : Aug 29, 2019, 9:53 AM IST

Updated : Sep 28, 2019, 5:03 PM IST

భారత్​లో ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తుంది ప్రభుత్వం. భారత హాకీ దిగ్గజం ధ్యాన్​​ చంద్​ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఈ వేడుకను జరుపుకొంటాం. 1905లో ఉత్తరప్రదేశ్​లోని అలహాబాద్​లో పుట్టిన ఆయన.. ఒలింపిక్స్​లో భారత్​కు మూడు బంగారు పతకాలు (1928, 1932, 1936) తెచ్చాడు. 22 ఏళ్ల కెరీర్​లో 400 గోల్స్​ సాధించాడీ ఆటగాడు. ధ్యాన్​చంద్​ క్రీడారంగంలో చేసిన కృషికి గుర్తుగా ఈ రోజున క్రీడాకారులకు అవార్డులు అందజేస్తారు. క్రీడల్లో దేశానికి పేరు తెచ్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేస్తారు.

National Sports Day Awards
భారత హాకీ దిగ్గజం మేజర్​ ధ్యాన్​చంద్​

1. ఖేల్​ రత్న

క్రీడారంగంలో అత్యున్నత భారతీయ పురస్కారం రాజీవ్​గాంధీ ఖేల్ రత్న. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించారు. ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ క్రీడలు వంటి పలు అంతర్జాతీయ టోర్నీల్లో.. నాలుగేళ్ల కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు వ్యక్తిగత, బృంద విభాగంలో ఈ అవార్డు అందజేస్తారు. పురస్కారంతో పాటు మెడల్, ప్రశంసాపత్రం, రూ. 7.5 లక్షల నగదు బహుకరిస్తారు. చెస్ గ్రాండ్‌ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మొదటి అవార్డు స్వీకరించాడు.

2. అర్జున అవార్డు

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించడానికి యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1961 నుంచి అర్జున అవార్డు ప్రదానం చేస్తోంది. పురస్కార గ్రహీతలను అర్జునుడి కాంస్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ. 5 లక్షల నగదుతో సత్కరిస్తారు. నాలుగేళ్ల కాలంలో క్రీడల్లో ప్రతిభ చూపించడమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కలిగిని వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.

3. ద్రోణాచార్య అవార్డు

అంతర్జాతీయ స్థాయిలో పతక విజేతలను తయారుచేసిన ఉత్తమ క్రీడా శిక్షకులకు ఈ అవార్డు ఇస్తారు. 1985 నుంచి ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేస్తున్నారు. విజేతలకు ద్రోణాచార్య విగ్రహం, ప్రశంసాపత్రం, రూ.7 లక్షల నగదును బహుకరిస్తారు. ప్రతి ఏటా ఈ అవార్డు అందజేస్తారు.

4. ధ్యాన్​చంద్​ అవార్డు

ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల కోసం ఆటగాళ్లకు శిక్షణనిస్తూ వారికి తోడ్పాటు అందించిన క్రీడాకారులకు.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఆటలను ప్రోత్సహించే కోచ్​లకు ఈ అవార్డు అందిస్తున్నారు. విజేతలకు ప్రశంసాపత్రంతో పాటు రూ.5 లక్షల నగదు బహుమతిగా ఇస్తారు.

వీటితో పాటు మరికొన్ని అవార్డులను క్రీడాకారులకు రాష్ట్రపతి అందజేస్తారు.

National Sports Day Awards
జాతీయ క్రీడా అవార్డులు

టెన్జింగ్​ నార్గే జాతీయ సాహస అవార్డు:

సాహస క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఇందులో నాలుగు విభాగాలుంటాయి. నేల, నీరు, గాలి, జీవిత సాఫల్య విభాగాల్లో ఈ అవార్డు ప్రదానం చేస్తారు. విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతి, ఉత్సవ దుస్తులు, ఒక ప్రశంసా పత్రం ఇస్తారు.

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం

ఈ అవార్డు క్రీడాకారులకు, శిక్షకులకు కాకుండా క్రీడల్లో ఇతర పాత్రలు పోషించిన వారికి ఇస్తారు. ఆటలను ప్రోత్సహిస్తోన్న సంస్థలు, వ్యక్తులు, క్రీడా బోర్డులు, ఎన్జీఓలకు ఈ ట్రోఫీలు ఇస్తారు. ఇందులో నాలుగు విభాగాలుంటాయి.

  1. యువ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించి వారికి తోడ్పాటు అందించడం
  2. సామాజిక సేవలో భాగంగా సంస్థలు.. క్రీడలకు ప్రోత్సాహమివ్వడం
  3. క్రీడాకారులకు ఉపాధి, సంక్షేమ చర్యలు
  4. ఆటల కోసం ప్రతిభ అకాడమీల స్థాపన, నిర్వహణ

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ

ఈ ట్రోఫీని 1956-57 నుంచి భారత క్రీడా మంత్రిత్వశాఖ ఇస్తోంది. ఇంటర్ యూనివర్సిటీ, జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆల్​రౌండ్​ ప్రదర్శన చూపిన సంస్థలకు దీన్ని ప్రదానం చేస్తారు. విజేతలకు ట్రోఫీతో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.

జాతీయ క్రీడాదినోత్సవాన్నే రాష్ట్రీయ ఖేల్​ దివస్​గానూ పిలుస్తారు. ఈరోజున దేశవ్యాప్తంగా క్రీడల ప్రాధాన్యం, వాటి ముఖ్య పాత్ర గురించి అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి.

ఇదీ చదవండి...హాకీ కర్ర పట్టుకున్న మాంత్రికుడు.. ఈ చంద్రుడు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 28, 2019, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.