ఒలింపిక్ రజత పతక విజేత, రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ మీరాబాయ్ చాను మరో ఘనతను సాధించింది. 36వ నేషనల్ గేమ్స్ 2022లో 49కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. మొత్తంగా క్లీన్ అండ్ జెర్క్‌లో(84+107) 191కేజీల బరువు ఎత్తి ఈ ఘనత సాధించింది. ఇదే క్రీడల్లో కామన్వెల్త్ గోల్డ్ మెడలస్ట్ సంజితా చను సిల్వర్ మెడల్‌ను దక్కించుకుంది. ఈమె క్లీన్ అండ్ జెర్క్‌లో(82+105) 187 కేజీల బరువు ఎత్తింది.
అయితే ఈ ఘతన సాధించడంపై హర్షం వ్యక్తం చేసింది మీరాబాయ్ చాను. తాను ఇటీవలే మణికట్టు గాయంతో బాధపడినట్లు చెప్పింది. "ఇటీవలే ఎన్ఐఎస్లో ట్రైనింగ్ చేసేటప్పుడు నా మణికట్టుకు గాయమైంది. అయితే గాయం తీవ్రత ఎక్కువ కాకుండా జాగ్రత్త పడ్డాను. డిసెంబరులో జరగబోయే ప్రపంచ ఛాంపియన్షిప్స్ కోసం సన్నద్ధమవుతున్నా. జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకల్లో నన్ను ప్రాతినిధ్యం వహించమని అడగడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్లో పాల్గొనడం ఓ ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను" అని మీరాబాయ్ పేర్కొంది.
ఇదీ చూడండి: టీమ్ఇండియా దిగ్గజంతో కలిసి గోల్ఫ్ ఆడిన ధోనీ.. వీడియో చూశారా?