ETV Bharat / sports

ఆసియా ఛాంపియన్​షిప్​కు మీరాబాయి చాను​ దూరం - గాయం నుంచి ఇంకా కోలుకోలేదంటూ!

Mirabai Chanu Asian Championships 2024 : ఉజ్బెకిస్థాన్​లోని తాష్కెంట్‌ వేదికగా జరగనున్న ఆసియా ఛాంపియన్​షిప్స్​కు స్టార్ వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చానూ దూరం కానున్నారు. గత అక్టోబర్​లో గాయపడిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.

Mirabai Chanu set to miss Asian Championships

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 6:09 PM IST

Updated : Dec 12, 2023, 7:30 PM IST

Mirabai Chanu Asian Championships 2024 : ఉజ్బెకిస్థాన్​లోని తాష్కెంట్‌ వేదికగా 2024 ఫిబ్రవరీలో జరగనున్న ఆసియా ఛాంపియన్​షిప్స్​కు స్టార్ వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చానూ దూరం కానున్నారు. అక్టోబర్​లో జరిగిన ఆసియా క్రీడల్లో గాయపడిన ఆమె ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పూర్తిగా ఫిట్​ కాలేదని అందుకే ఈ టోర్నీకి దూరం కానున్నట్లు ఆమె తెలిపారు. అయితే ప్రపంచకప్​ సమయానికల్లా ఆమె మునపటిలా మారి పోటీల్లో పాల్గొంటానని వెల్లడించారు.

మరోవైపు పారిస్ ఒలింపిక్ క్వాలిఫికేషన్​ రూల్స్​ ప్రకారం రానున్న ఒలంపిక్స్​లో పాల్గొనాలంటే ఓ లిఫ్టర్ తప్పనిసరిగా 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్​తో పాటు 2024 ప్రపంచ కప్‌లో పాల్గొనవలసి ఉంటుంది. అంతే కాకుండా 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, 2023, 2024 కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌, 2023 గ్రాండ్ ప్రిక్స్ I, 2023 గ్రాండ్ ప్రిక్స్ IIలోనూ తమ సత్తా చాటాల్సి ఉంటుంది. అయితే ఆసియా ఛాంపియన్‌షిప్‌లను మిస్​ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్​ తన అప్​కమింగ్ ఈవెంట్స్​పై పడదని విశ్లేషకుల మాట. దీనికి కారణం ఆమె ప్రస్తుత ఒలింపిక్ క్వాలిఫికేషన్ ర్యాంకింగ్ (OQR)లో రెండో స్థానంలో ఉన్నారు. ఇక తాజా జాబిత గ్రాండ్ ప్రిక్స్ II ముగిసిన తర్వాత వెలువరనుంది.

ప్రస్తుతం చాను పాటియాలాలోని ఓ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన తదుపరి మ్యాచ్​ల కోసం శిక్షణ తీసుకునేందుకు యూఎస్​కు పయనవ్వనున్నారు. అందులో భాగంగా ఆమె ట్రైనింగ్ కోచ్ డాక్టర్ ఆరోన్​ హోర్షిగ్​ను కలవనున్నారు. ఈయన ఓ మాజీ వెయిట్‌లిఫ్టర్‌. ప్రస్తుతం ఫిజికల్​ థెరపిస్ట్​గా పని చేస్తున్నారు. ఈయన దగ్గర చికిత్స తీసుకంటూ మెలకువలు నేర్చుకోవాలని చానూ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Mirabai Chanu Asian Games : ఆసియా క్రీడల్లో తొలి పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన మీరాబాయి ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్నారు. అయితే కండర గాయం కారణంగా బరువెత్తలేకపోయారు. దీంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుని ఆమె పతకానికి దూరమయ్యారు. వార్మప్​ సమయంలోనే ఆమె కండరం నొప్పితో బాధపడటం వల్ల పోటీ నుంచి వైదొలగాలని కోచ్‌ విజయ్‌ శర్మ ఆమెకు సూచించాడు. కానీ పట్టుబట్టి బరిలోకి దిగిన ఆమె తొలి యత్నంలోనే 83 కిలోల బరువెత్తారు. ఆ తర్వాతి రెండు, మూడు ప్రయత్నాల్లో 86 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించారు. కాని విఫలమయ్యారు. ఇక క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో తొలి యత్నంలో 108 కి. బరువెత్తిన ఆమె ఆ తర్వాతి యత్నంలో 117 కేజీలకు పెంచుకున్నప్పటికీ ఎత్తలేకపోయారు. అయితే మూడో ప్రయత్నంలో బరువెత్తలేక మ్యాట్‌పై పడిపోయారు. దీంతో మీరా కుంటుతూ స్టేజ్‌ వీడారు.

'సైఖోమ్‌.. నువ్వో లెజెండ్‌'.. మీరాబాయి చానుపై హాలీవుడ్ స్టార్ ప్రశంసలు

మీరాబాయి చాను@ రజతం​.. మణికట్టు గాయంతోనే 200 కేజీల బరువు ఎత్తి..

Last Updated : Dec 12, 2023, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.