ప్రముఖ రన్నర్ మిల్కా సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు వెల్లడించారు. ప్రస్తుతం మిల్కా.. చంఢీగడ్‌లో తన ఇంట్లో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.
ఫ్లయింగ్ సిక్‌గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్.. ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లోని 400 మీటర్ల విభాగంలో బంగారు పతకం గెలిచిన ఏకైక అథ్లెట్. అలానే 1958, 1962 ఆసియా గేమ్స్.. 1956, 1960, 1964 ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్నారు. క్రీడల్లో దేశానికి చేసిన సేవకుగానూ మిల్కాకు పద్మశ్రీ ఇచ్చిన గౌరవించింది మన ప్రభుత్వం.