ETV Bharat / sports

ఆసుపత్రి నుంచి మిల్కా సింగ్ డిశ్ఛార్జ్

భారత స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

author img

By

Published : May 30, 2021, 8:51 PM IST

star sprinter
మిల్కా సింగ్, స్టార్ స్ప్రింటర్

కొవిడ్​తో ఆసుపత్రిలో చేరిన భారత్ లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్​ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఆయన ప్రస్తుతం ఆక్సిజన్​ సాయంతో ఊపిరితీసుకుంటున్నారు.

"కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిల్కాసింగ్​ను డిశ్చార్జ్​ చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆక్సిజన్​ సపోర్ట్​తో ఉన్నారు" అని మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

మిల్కా సింగ్​ భార్య నిర్మలా కౌర్​కు ఆక్సిజన్​ అవసరం రాగా.. శనివారం ఐసీయూకు తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

కొవిడ్​ కారణంగా మిల్కా సింగ్ గత సోమవారం, ఆయన భార్య బుధవారం ఒకే ఆసుపత్రిలో చేరారు.

ఇదీ చదవండి:

కొవిడ్​తో ఆస్పత్రిలో చేరిన మిల్కా సింగ్

నిలకడగా మిల్కా సింగ్ ఆరోగ్యం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.