టోక్యో ఒలింపిక్స్- 2020 దగ్గర పడుతున్న వేళ చైనా జోరు పెంచింది. ఆ దేశ బాక్సర్లు బంగారు పతకం తేచ్చేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే అమెరికా స్టార్ బాక్సర్, ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఫ్లాయిడ్ మేవేదర్ను చైనా బాక్సింగ్ జట్టుకు ప్రత్యేక సలహాదారుడిగా నియమించింది. ఈ విషయాన్ని చైనీస్ బాక్సింగ్ ఫెడరేషన్ వెల్లడించింది.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో చైనా తరఫున తొలిసారి ఈ క్రీడలో కాంస్య పతకం గెలిచాడు జోషిమ్మింగ్. అతడే 2008, 2012 క్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు. అయితే రియోలో ఆ దేశ బాక్సర్లు బాగా నిరాశపరచడం వల్ల టోక్యోలోనైనా మెరుగ్గా రాణించేలా తర్ఫీదు ఇస్తోంది.
2017 ఆగస్ట్‌లో భీకర పోరులో కానర్ మెక్‌గ్రెగర్‌ను ఒడించాడు మేవేదర్. తర్వాత మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టలేదు. కెరీర్లో 50 మ్యాచ్‌లు ఆడి ఒక్క దానిలోనూ ఒడిపోలేదు మేవేదర్. 27 నాకౌట్లు, ఐదు విభాగాల్లో పోటీపడి 5 ప్రపంచ స్థాయి టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.
ఇది చదవండి: జపాన్ ఓపెన్: సాయి ప్రణీత్ ఆరంభం అదుర్స్