ETV Bharat / sports

పసిడికి అడుగు దూరంలో భారత బాక్సర్లు

దుబాయ్​ వేదికగా జరుగుతోన్న ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. భారత్ నుంచి మేరీ కోమ్​, పూజా రాణి, అనుపమ, లాల్బుత్సాహిలు మహిళా విభాగంలో ఫైనల్స్​కు దూసుకెళ్లారు. అమిత్ పంగాల్, శివ థాప, సంజీత్​.. పురుషుల విభాగం నుంచి తుది పోరుకు సిద్ధమయ్యారు.

meri kom, amith pangal
మేరీ కోమ్, అమిత్ పంగాల్
author img

By

Published : May 30, 2021, 5:31 AM IST

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్​ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. పలువురు భారత బాక్సర్లు ఫైనల్స్​ బరిలో నిలిచారు. స్వర్ణ పతకమే లక్ష్యంగా చివరి పోరులోనూ గెలవాలని భావిస్తున్నారు.

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్​ మేరీ కోమ్​ బాక్సింగ్ పోటీల ఫైనల్స్​కు చేరింది. 51 కేజీల విభాగంలో కజకిస్థాన్​ బాక్సర్​ నాజీమ్ కైజాయ్​తో తలపడనుంది. ఇప్పటికే ఈ పోటీల్లో ఐదు సార్లు బంగారు పతకాలు గెలిచిన మేరీ.. మరో గోల్డ్​ మెడల్​ను తన ఖాతాలో వేసుకోవాలని యోచిస్తోంది.

గురువారం జరిగిన సెమీస్​లో మంగోలియా బాక్సర్​ లుట్సైఖాన్ అల్తాంట్‌సెట్సెగ్​పై 4-1 తేడాతో గెలిచి ఊపుమీదుంది మేరీ. ఇక తుది పోరులో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్​ అయినా కైజాయ్​ వంటి గట్టి ప్రత్యర్థితో పోరుకు సై అంటోంది.

మేరీ కోమ్​తో పాటు బాక్సర్లు పూజా రాణి, అనుపమ, లాల్బుత్సాహిలు ఆదివారం జరిగే ఫైనల్స్​లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇదీ చదవండి: ఒలింపిక్స్​ శిక్షణ కోసం పుణెకు​ మేరీకోమ్​

ఇక పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్​ అమిత్ పంగాల్(52 కేజీ), శివ థాప(64 కేజీ), సంజీత్​(91 కేజీ).. సోమవారం జరిగే ఫైనల్స్​లో పాల్గొనడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అమిత్ పంగాల్ తన చివరి పోరులో ఉజ్బెకిస్థాన్ బాక్సర్​ జోయిరోవ్ షాఖోబిడిన్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. మరో బాక్సర్​ శివ థాప.. మంగోలియా ప్లేయర్​ బాతర్సుఖ్ చిన్జోరిగ్​తో తలపడనున్నాడు. ఇక రెండో సీడ్ ఆటగాడు సంజీత్​.. కజకిస్థాన్ బాక్సర్​ వాసిలీ లెవిట్​తో పోటీ పడనున్నాడు.

2019 ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్​ పోటీల్లో 13 మెడల్స్​ కొల్లగొట్టిన భారత్.. ఈ సారి ఆ సంఖ్యను మరింత పెంచారు. ఇప్పటికే 15 పతకాలు ఖాయం చేసుకున్నారు.

ఇదీ చదవండి: శివ థాపా.. టైసన్​ను చూసి పంచ్​లు నేర్చి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.