హర్యానాలోని జజ్జర్లో పుట్టిన మనుబాకర్.. నేడు దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. 17 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మెగాటోర్నీలో భాగంగా నవంబర్ 17న జరగనున్న పుతియన్ ప్రపంచకప్ ఫైనల్స్ కోసం సన్నాహాల్లో ఉన్న ఈ స్టార్ షూటర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఎలా వచ్చిందంటే...?
మనుబాకర్.. గతంలో మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ వంటి పలు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించింది. అయితే వాటన్నింటిని కాదని.. అనుకోకుండా షూటింగ్‌లోకి వచ్చినట్లు చెప్పింది.
ఇప్పటివరకు వివిధ ప్రపంచకప్‌ల్లో 6 స్వర్ణాలు సహా కామన్వెల్త్‌లోనూ పసిడి సొంతం చేసుకుంది మను. చిన్న వయసులోనే ఇంత గొప్ప స్థాయికి ఎదగడం వెనుక కష్టపడే తత్వంతో పాటు ప్రశాంతమైన మనస్సుతో ఉండటం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాలే ఆమెను ప్రత్యేకంగా మార్చాయి.
ఇదే ఏడాది మ్యూనిచ్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆమె పిస్తోల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రపంచ రికార్డు సాధించే అవకాశం కోల్పోయింది. ప్రస్తుతం కఠోర శిక్షణలో ఉన్న మను... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం కచ్చితంగా సత్తా చాటుతానని ధీమా వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి..