ETV Bharat / sports

Korea Open: క్వార్టర్స్​కు సింధు, శ్రీకాంత్​.. లక్ష్యసేన్​కు షాక్​ - Sindhu enters quarter finals

Korea Open: కొరియా ఓపెన్​లో భారత స్టార్​ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ ​క్వార్టర్​ ఫైనల్​కు దూసుకెళ్లారు. మరోవైపు లక్ష్యసేన్​కు అనూహ్య ఓటమి ఎదురైంది.

Sindhu enters quarter finals
Sindhu enters quarter finals
author img

By

Published : Apr 7, 2022, 11:15 AM IST

Updated : Apr 7, 2022, 1:48 PM IST

Korea Open: కొరియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో పీవీ సింధు అదరగొడుతోంది. రెండో రౌండ్​లో జపాన్​కు చెెందిన అయా ఒహోరీని వరుస సెట్లలో చిత్తు చేసి.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించింది. 37 నిమిషాల్లోనే 21-15,21-10 తేడాతో ఓడించింది సింధు. పురుషుల సింగిల్స్​లో ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్​.. మిషా జిల్బర్​మ్యాన్​ను(ఇజ్రాయెల్​) 21-18,21-6 తేడాతో చిత్తుగా ఓడించాడు. క్వార్టర్స్​లో స్థానిక షట్లర్​, ప్రపంచ మాజీ నెం.1 సన్​ వాన్​ హోతో తలపడనున్నాడు.

మరోవైపు.. భారత స్టార్​ బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు కొరియా ఓపెన్​ నుంచి ఇంటిముఖం పట్టాడు. గురువారం జరిగిన రెండో రౌండ్​ మ్యాచ్​లో ఇండోనేసియాకు చెందిన శేసర్​ హిరెన్​ చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. 33 నిమిషాల్లోనే మ్యాచ్​ ముగియడం గమనార్హం. వరల్డ్​ నెం.24 షట్లర్​ చేతిలో 20-22, 9-21 తేడాతో దారుణంగా ఓడాడు ప్రపంచ ర్యాంకింగ్స్​లో 9వ స్థానంలో ఉన్న సేన్​. 6 నెలలుగా అత్యుత్తమ ఫామ్​లో ఉన్నాడు సేన్​. వరుసగా జర్మన్​ ఓపెన్​, ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్స్​లో ఫైనల్​కు దూసుకెళ్లాడు. అంతకుముందు ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో కాంస్య పతకం నెగ్గాడు. మిక్స్​డ్​ డబుల్స్​లో సుమిత్​ రెడ్డి- అశ్విని పొన్నప్ప జోడీ కూడా హోరాహోరీ పోరులో ఓడిపోయింది. 20-22, 21-18,14-21 తేడాతో ఐదో సీడ్​ చైనాకు చెందిన షియాన్​ యీ, హువాంగ్​ యా చేతిలో పరాజయం పాలైంది.

ఇవీ చూడండి: 'ధోనీ ఏదో చెప్పాడు.. వెంటనే అవుట్​ అయిపోయా'

ఒక్క​ ఓటమితో మార్షల్​ ఆర్ట్స్​కు గుడ్​బై.. ఈమె విశేషాలు తెలుసా?

Last Updated : Apr 7, 2022, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.