పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరిత స్టేడియాలు, క్రీడా అకాడమీలు నిర్మిస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజీజు ప్రకటించారు. క్రీడా సంస్థలన్నింటిని పర్యావరణ హితంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. దిల్లీలో ఆయన అశోక చెట్టును నాటిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
"ఈ చెట్లు నాటే ప్రకియ సుదీర్ఘంగా జరగనుంది. ఈ రోజు దీనికి తొలి అడుగు పడింది. స్పోర్ట్స్ అథారిటీ తరఫున స్టేడియాలు, అకాడమీలు నిర్మిస్తాం. అన్నింటినీ పర్యావరణ హితంగా పచ్చదనంతో నింపుతాం" - కిరణ్ రిజీజు, కేంద్ర క్రీడా మంత్రి.
అనంతరం దిల్లీ జవహర్లాల్ నెహ్రు వర్సిటీలో అథ్లెట్లను కలిశారు కేంద్రమంత్రి. వారి సమస్యలు తెలుసుకున్న ఆయన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవలే కేంద్ర క్రీడా మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కిరణ్ రిజీజు.