ETV Bharat / sports

ISSF World Cup 2022: మెరిసిన అంజుం.. షూటింగ్​ ప్రపంచకప్​లో రజతం - issf shooting world cup 2022

ISSF World Cup 2022: షూటింగ్​ ప్రపంచకప్‌లో రజతంతో సత్తాచాటింది అంజుం మౌద్గిల్‌. అజర్‌బైజాన్‌లో శుక్రవారం జరిగిన స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్‌ ఇబ్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడింది.

shooting World Cup
ISSF World Cup 2022
author img

By

Published : Jun 4, 2022, 8:24 AM IST

ISSF World Cup 2022: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌లో అంజుం మౌద్గిల్‌ మెరిసింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల వ్యక్తిగత 50 మీటర్ల రైఫిల్‌ త్రి పొజిషన్స్‌లో ఆమె రజతం సొంతం చేసుకుంది. శుక్రవారం స్వర్ణ పతక పోరులో అంజుం 12-16తో రికీ మెంగ్‌ ఇబ్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడింది. క్వాలిఫయింగ్‌ స్టేజ్‌-1లో 587 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి స్టేజ్‌-2కు అర్హత సాధించిన అంజుం.. స్టేజ్‌-2లో 406.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌ చేరింది. తుది సమరంలోనూ గట్టిగానే పోరాడినా ఆమెకు రజతమే దక్కింది.

shooting World Cup
రజతంతో అంజుం

పురుషుల టీమ్‌ త్రిపొజిషన్స్‌లో స్వప్నిల్‌, దీపక్‌ కుమార్‌, గోల్డీ గుర్జార్‌తో కూడిన భారత జట్టు రజతం సాధించింది. పసిడి పోరులో భారత్‌ 7-17తో క్రొయేషియా చేతిలో ఓడింది. మహిళల త్రిపొజిషన్స్‌లో అంజుం-ఆయూషిలతో కూడిన భారత జట్టు ఫైనల్‌ చేరడంలో విఫలమైంది. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్లో 1316 పాయింట్లతో రెండో రౌండ్‌ చేరిన భారత్‌.. ఆ తర్వాత ముందంజ వేయలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక స్వర్ణం, మూడు రజతాలతో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

shooting World Cup
అంజుం మౌద్గిల్‌

ఇదీ చూడండి: రెజ్లింగ్​లో భారత్​కు మూడు స్వర్ణాలు.. ఐదేళ్ల తర్వాత సాక్షికి మళ్లీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.