ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ ఆపబోమని ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే గతేడాది జరగాల్సిన ఈ మెగా ఈవెంట్.. కరోనా కారణంగా 2021కి వాయిదా పడింది. అయితే.. జపాన్‌లో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఒలింపిక్స్ నిర్వహించకూడదని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
'ప్రజల మాట వింటాం. కానీ, వారు చెప్పిందే అంతిమ నిర్ణయం కాదు' అని ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ సభ్యుడు మార్క్ ఆడమ్స్ అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ తప్పక జరుగుతుందని స్పష్టం చేశారు.
ఒలింపిక్స్ నేపథ్యంలో టోక్యోలో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. ఈ కారణంగా ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ జపాన్ పర్యటన రద్దైంది.
ఇదీ చదవండి
ఒలింపిక్స్‌ను వద్దంటున్న 60 శాతం మంది!