కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ల స్వర్ణం ఆశలు అవిరయ్యాయి. గురువారం జరిగిన సెమీస్‌లో భజరంగ్ పునియా, రవి దహియా ఓడిపోయారు. అయినప్పటికీ ఒలింపిక్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నారు.
పురుషుల 65 కేజీల విభాగం సెమీస్‌లో... కజికిస్థాన్కు చెందిన దౌలత్ నియాజ్బెకోవ్ చేతిలో 2-7 తేడాతో చిత్తుగా ఓడిపోయాడు భజరంగ్. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన మరో భారత రెజ్లర్ రవి దహియా... ప్రపంచ ఛాంపియన్ జౌర్ ఉగ్వేవ్ చేతిలో 4-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే అంతకు ముందు క్వార్టర్స్‌లో నెగ్గిన వీరిద్దరూ.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. కాంస్యం కోసం శుక్రవారం జరిగే పోరులో ఈ ఇద్దరు రెజ్లర్లు తలపడనున్నారు.
మహిళల 62 కేజీల విభాగంలో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్... అమెనాట్ (నైజీరియా) చేతిలో 7-10 తేడాతో ఓడిపోయింది. అయితే అమెనాట్ ఫైనల్ చేరితే... రెపిచేజ్ విభాగంలో సాక్షికి పతక కోసం పోరాడేందుకు మరో అవకాశం దక్కనుంది. మహిళల 53 కేజీల విభాగంలో ఇప్పటికే కాంస్య పతకం నెగ్గిన వినీశ్ ఫొగాట్.. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.