ISSF World Cup India Gold medal: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మూడో స్వర్ణం దక్కింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో రాహీ సర్నోబత్, ఇషా సింగ్, రిథమ్ సంగ్వాన్ త్రయం పసిడి పతకం గెలుచుకుంది. టైటిల్ పోరులో భారత జట్టు 17-13తో సింగపూర్ జట్టుపై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇషాకు ఇది రెండో స్వర్ణం, మూడో పతకం. ఇంతకుముందు ఆమె మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. ఇషా మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో రజతం సాధించింది.
మరోవైపు 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు శ్రియాంక, అఖిల్‌ల జోడీ కాంస్యం గెలుచుకుంది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో ఈ జంట.. ఆస్ట్రేలియాకు చెందిన రెబెక్కా కొయెక్, గెర్నోట్ రంప్లర్‌లపై విజయం సాధించింది. మూడు స్వర్ణాలు సహా ఇప్పటివరకు అయిదు పతకాలు గెలుచుకున్న భారత్.. ఈ టోర్నమెంట్ పతకాల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
ఇదీ చూడండి: కోహ్లీ వందో టెస్టులో ఎన్ని రికార్డులో తెలుసా..?