ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్​: భారత షాట్​గన్​ కోచ్​కు కరోనా

author img

By

Published : Feb 28, 2021, 2:12 PM IST

ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్​ ప్రపంచకప్​లో పాల్గొనేందుకు ఈజిప్టు వెళ్లిన భారత షాట్​గన్​ కోచ్​కు కరోనా సోకినట్లు తేలింది. ఆ కోచ్​ ప్రస్తుతం ఐసోలేషన్​కు పంపినట్లు జాతీయ రైఫిల్​ సంఘం వెల్లడించింది.

Indian shotgun coach in isolation after testing positive for corona
షూటింగ్​ ప్రపంచకప్​: భారత కోచ్​కు కరోనా

ఈజిప్టులోని కైరో వేదికగా జరగనున్న ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్​ ప్రపంచకప్​కు వెళ్లిన భారత షాట్​గన్​ కోచ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో అతడిని వెంటనే ఐసోలేషన్​కు తరలించినట్లు జాతీయ రైఫిల్​ సంఘం వెల్లడించింది. రెండు రోజుల తర్వాత ఆ కోచ్​కు మరోసారి కొవిడ్​ టెస్ట్​ నిర్వహిస్తారని తెలిపింది.

టోర్నీలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన క్రీడాబృందానికి కరోనా పరీక్షలు చేయగా అందులో ఓ భారతీయ షాట్​గన్​ కోచ్​కు కరోనా సోకినట్లు తేలింది. కోచ్​కు తప్ప మిగిలిన బృందానికి కొవిడ్​ టెస్ట్​ల్లో నెగటివ్​గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఉక్రెయిన్​ రెజ్లింగ్​ టోర్నీ ఫైనల్లో వినేశ్​ ఫొగాట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.