ఆసియా అథ్లెటిక్ అసోసియేషన్ (ఏఏఏ) కీలక విభాగంలో చోటు దక్కించుకుంది పరుగుల రాణి పీటీ ఉష. ఆరుగురు సభ్యుల అథ్లెట్స్ కమిషన్‌లో ఆమెకు స్థానం లభించింది. ఈ బృందానికి ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ఆండ్రే అబ్దువలియేమ్ అధ్యక్షత వహించనున్నాడు.
" ఏఏఏ అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎంపికవడం నా అదృష్టం. ఇలాంటి అవకాశం ఇవ్వడాన్ని మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఇది నాకు, దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా".
-- పీటీ ఉష, భారత మాజీ స్ప్రింటర్
-
It is an incredible honour to be part of the Member of Athletes Commission of the Asian Athletic Association. I express my sincere gratitude! 🙏 pic.twitter.com/rAGkMkrvBh
— P.T. USHA (@PTUshaOfficial) August 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">It is an incredible honour to be part of the Member of Athletes Commission of the Asian Athletic Association. I express my sincere gratitude! 🙏 pic.twitter.com/rAGkMkrvBh
— P.T. USHA (@PTUshaOfficial) August 13, 2019It is an incredible honour to be part of the Member of Athletes Commission of the Asian Athletic Association. I express my sincere gratitude! 🙏 pic.twitter.com/rAGkMkrvBh
— P.T. USHA (@PTUshaOfficial) August 13, 2019
ఇందులో చైనాకు చెందిన వాంగ్యు, కజకిస్థాన్‌కు చెందిన ట్రిపుల్ జంపర్ ఓల్గా రిప్కోవా, మలేసియా నుంచి లీ హుప్ వే, సౌదీ అరేబియా నుంచి షాదాద్ ఉన్నారు. కొత్తగా ఎంపికైన ఉషను ఏఏఏ సెక్రటరీ జనరల్ ఏ షుగ్గుమారన్ అభినందించారు.
1980వ దశకంలో ఆసియాలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా పేరు తెచ్చుకుందీ పయోలి ఎక్స్‌ప్రెస్. 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకన్లో వందో వంతు తేడాతో కాంస్య పతకం కోల్పోయింది ఉష. 1986 సియోల్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు సహా ఐదు పతకాలు నెగ్గిందీ స్టార్ స్ప్రింటర్. జకార్తా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, కాంస్యంతో సత్తాచాటింది.
ఇదీ చదవండి...పాక్, ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా భారత్