ETV Bharat / sports

జూడోలో అదరగొట్టిన భారత్.. కామన్​వెల్త్​లో రెండు పతకాలు

commonwealth games 2022
commonwealth games 2022
author img

By

Published : Aug 1, 2022, 10:21 PM IST

Updated : Aug 1, 2022, 10:51 PM IST

22:14 August 01

జూడోలో అదరగొట్టిన భారత్.. కామన్​వెల్త్​లో రెండు పతకాలు

కామన్​వెల్త్​ క్రీడల్లో దూసుకుపోతున్న భారత్​.. మరో రెండు పతకాలను కైవసం చేసుకుంది. మహిళల జూడో 48కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి ఎల్. సుశీలాదేవీ రజతాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్​లో దక్షిణాఫ్రికాకు చెందిన మిచెలా వైట్​బూయి చేతిలో ఓడిన సుశీలా.. రజత పతకాన్ని గెలుచుకున్నారు. పురుషుల 60కిలోల విభాగంలో విజయ్​కుమార్​ యాదవ్​ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 2018, 2019 కామన్​వెల్త్​ క్రీడల్లో ఛాంపియన్​గా నిలిచిన విజయ్​కుమార్​ కాంస్యాన్ని సాధించారు.

మోదీ, షా అభినందనలు:
కామన్​వెల్త్​ క్రీడల్లో పతకాలు సాధించిన సుశీలాదేవి, విజయ్​కుమార్​ యాదవ్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సుశీలా దేవి అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కూడా క్రీడాకారులను అభినందించారు.

ఇవీ చదవండి: Commonwealth Games: ఆ అన్న త్యాగం.. తమ్ముడికి స్వర్ణం

'పాక్​ చేసిన తప్పే బీసీసీఐ చేస్తోంది.. అలాంటి కెప్టెన్లు కావాలి'

Last Updated : Aug 1, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.