టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) నుంచి భారత బృందం (indian olympic contingent) స్వదేశానికి చేరుకుంది. దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో వారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) (SAI) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ అదిల్లే సుమరివాలా ఘనస్వాగతం పలికారు. అథ్లెట్ల కుటుంబ సభ్యులతో పాటు స్థానిక రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. డోలు చప్పుళ్లతో, బ్యాండ్లు కొడుతూ, పాటలు పాడుతూ త్రివర్ణ పతాకాన్ని చేతబూని పలువురు డ్యాన్స్‌లు చేశారు.
పతక విజేతలను చూడటానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున రావడం వల్ల ఎయిర్పోర్ట్ వద్ద కాస్త ఉద్రిక్త వాతవరణం నెలకొంది. చాలా మంది మాస్క్‌లు లేకుండానే వచ్చారు. భౌతిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. దీంతో ఆటగాళ్లు త్వరగానే అక్కడి నుంచి నిష్క్రమించారు.
ఈ బృందంలో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డాతో పాటు రెజ్లర్ బజరంగ్ పునియా, రేసర్ కేటీ ఇర్ఫాన్, దీపక్ పునియా, లవ్లీనా.. తదితరులు ఉన్నారు. మీరాబాయి చాను, పీవీ సింధు వారి ఈవెంట్లు ముగిసిన వెంటనే భారత్‌కు చేరుకున్నారు.
-
Welcome home champions!
— SAIMedia (@Media_SAI) August 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🇮🇳 Athletics Team is back from the #Tokyo2020 Olympics. Lets welcome them with joy and excitement and #Cheer4India.
Watch the video and send in your best wishes in the comments below 👇🏻@PMOIndia @ianuragthakur @NisithPramanik @afiindia @WeAreTeamIndia pic.twitter.com/9wJrvdzjPC
">Welcome home champions!
— SAIMedia (@Media_SAI) August 9, 2021
🇮🇳 Athletics Team is back from the #Tokyo2020 Olympics. Lets welcome them with joy and excitement and #Cheer4India.
Watch the video and send in your best wishes in the comments below 👇🏻@PMOIndia @ianuragthakur @NisithPramanik @afiindia @WeAreTeamIndia pic.twitter.com/9wJrvdzjPCWelcome home champions!
— SAIMedia (@Media_SAI) August 9, 2021
🇮🇳 Athletics Team is back from the #Tokyo2020 Olympics. Lets welcome them with joy and excitement and #Cheer4India.
Watch the video and send in your best wishes in the comments below 👇🏻@PMOIndia @ianuragthakur @NisithPramanik @afiindia @WeAreTeamIndia pic.twitter.com/9wJrvdzjPC
టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పతకాలు సాధించారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో గెలుపొందిన 6 పతకాల సంఖ్యను ఈసారి అధిగమించారు. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డా పసిడితో మెరవగా, రెజ్లింగ్‌లో రవి దహియా, మీరాబాయి చాను రజతాలు సాధించారు. బాక్సింగ్‌లో లవ్లీనా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా, పురుషుల హాకీ టీమ్.. కాంస్య పతకాలు దక్కించుకున్నాయి.
ఇదీ చదవండి: 20 బ్రాండ్లపై పీవీ సింధు దావా! కారణమేంటి?