ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. 32వ ఒలింపిక్ గేమ్స్ శుక్రవారం ఆరంభోత్సవంతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జపాన్ జాతీయ స్టేడియంలో.. ఈ విశ్వ క్రీడల ముందస్తు కార్యక్రమం అట్టహాసంగా సాగింది.

'యునైటెడ్ బై ఎమోషన్' ధీమ్ ద్వారా 2013లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు టోక్యో బిడ్ సాధించనప్పటి నుంచి గతేడాది కరోనా సంక్షోభం కారణంగా విశ్వక్రీడలు వాయిదా పడిన సందర్భాలను ఓ వీడియో ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించారు. 20 సెకన్ల తర్వాత బాణసంచా ప్రారంభమయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ 2020 చిహ్నం ఆకారంలో బాణసంచా మిరుమిట్లు గొలిపాయి. ఇది జపాన్ సంప్రదాయం ప్రకారం శుభసూచికానికి గుర్తుగా చెప్పుకుంటారు.


జపాన్ చక్రవర్తి నరుహిటోతో కలిసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ థామస్ బాచ్ విశ్వక్రీడలను ప్రారంభించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు క్రీడాఅభిమానులను స్టేడియంలోకి అనుమతించలేదు. కరోనా సంక్షోభం కారణంగా 2020లో జరగాల్సిన ఈ విశ్వక్రీడలు ఏడాది పాటు వాయిదాపడ్డాయి.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్ ప్రారంభోత్సవం.. గతమెంతో ఘనం!