చాంగ్వాన్‌లో ఏప్రిల్ 16న ఆరంభమయ్యే ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో పాల్గొనకూడదని భారత జట్టు నిర్ణయించుకుంది. దక్షిణ కొరియాలో రెండు వారాల తప్పనిసరి క్వారంటైన్ నిబంధన ఉండడమే దీనికి కారణం.
"కొరియాలో 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్ నిబంధన ఉంది. అందుకే మా షూటర్లు ప్రపంచకప్‌లో పాల్గొనబోవట్లేదు. ఈ సమయంలో వాళ్లు ప్రాక్టీస్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు"
- భారత జాతీయ రైఫిల్ సంఘం
కొరియాలో జరగబోయే ప్రపంచకప్‌లో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ ఈవెంట్లను ఒకేసారి నిర్వహిస్తున్నారు. మార్చిలో భారత్ కంబైన్డ్ ప్రపంచకప్‌ను నిర్వహించనుంది.