ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తొలి రౌండ్లో టాప్ ప్లేయర్స్ పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ ఓటమిని చవి చూశారు. భారత్ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్య సేన్ చేతిలో ఓడిపోగా.. సింధు థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కతేథాంగ్ చేతిలో ఓటమి పాలైంది. సుమారు 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 21-14, 21-15 స్కోర్‌తో ప్రణయ్‌పై విజయం సాధించాడు. మరో వైపు పీవీ సింధు 12-21, 20-22 స్కోర్‌తో థాయ్‌లాండ్ క్రీడాకారిణి సుపానిడా కతేథాంగ్ చేతిలో పరాజయం పాలయ్యింది. అయితే గత సీజన్లో సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న సింధు ఇదే ప్లేయర్ చేతిలోనే ఓటమి పాలవ్వడం గమనార్హం.
సింధు, ప్రణయ్‌కు నిరాశ.. ఇండియా ఓపెన్ నుంచి ఔట్ - హెచ్ ఎస్ ప్రణయ్ బ్యాడ్మింటన్ మ్యాచ్
భారత్ వేదికగా జరుగుతున్న ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు, ప్రణయ్ వెనుతిరగాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్.. డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్య సేన్ చేతిలో ఓడిపోగా.. సింధు థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కతేథాంగ్ చేతిలో ఓటమి పాలైంది.