ETV Bharat / sports

India Open 2022: సింధు, శ్రీకాంత్‌ శుభారంభం - పీవీ సింధు కిదంబి శ్రీకాంత్ లేటెస్ట్ న్యూస్

India Open 2022: ఇండియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ టోర్నీలో భారత స్టార్ షెట్లర్స్ పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ విజయంతో ప్రారంభించారు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు.

India Open 2022
సింధు, శ్రీకాంత్‌
author img

By

Published : Jan 12, 2022, 7:10 AM IST

India Open 2022: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో వీరిద్దరు ప్రిక్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ సింధు 21-5, 21-16తో శ్రీకృష్ణప్రియపై విజయం సాధించింది. ఐరాశర్మ 21-10, 21-11తో దోహా హానీ (ఈజిప్ట్‌)పై నెగ్గింది.

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ శ్రీకాంత్‌ 21-17, 21-10తో సిరిల్‌వర్మపై గెలుపొందాడు. సమీర్‌వర్మ 21-7, 21-7తో సౌరభ్‌వర్మపై పైచేయి సాధించాడు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో ధ్రువ్‌ కపిల- సిక్కిరెడ్డి 21-11, 21-11తో చిరాగ్‌- నిషుపై, సాయి ప్రతీక్‌- గాయత్రి గోపీచంద్‌ పుల్లెల 21-16, 16-21, 21-17తో ఇషాన్‌- తనిషాపై గెలిచారు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా కీలక పదవిలో సచిన్.. జై షా రిక్వెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.