వరుసగా 11 బౌట్లు గెలిచి జోరు మీదున్నాడు భారత ప్రో బాక్సర్ విజేందర్ సింగ్. బాక్సింగ్ పంచ్ల్లోని ఊపును మాటల్లోనూ చూపిస్తున్నాడు. బ్రిటీష్ బాక్సర్ ఆమిర్ ఖాన్‌కు సవాల్ విసురుతూ.. మరో భారత బాక్సర్ నీరజ్ గోయత్ నొచ్చుకునేలా చేశాడు. పిల్లలతో కాదు తనతో తలపడాలని నీరజ్‌ను ఉద్దేశిస్తూ.. ఆమిర్‌కు సవాలు విసిరాడు విజేందర్. ఇందుకు స్పందించిన నీరజ్ 'నేను పిల్లాడిని కాదు.. నాతో పోరుకు సిద్ధమా' అంటూ విజేందర్‌ను ఛాలెంజ్ చేశాడు.
పాకిస్థాన్ సంతతికి చెందిన ఆమిర్.. భారత బాక్సర్ నీరజ్ గోయత్తో మ్యాచ్‌కు సిద్ధపడ్డాడు. నెల రోజుల క్రితమే ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వాయిదా పడింది. ఈ మధ్యలో అమెరికాకు చెందిన స్నైడర్‌ను ఓడించి 11వ బౌట్ గెలిచిన ఆనందంలో ఉన్న విజేందర్ ఆమిర్‌ను ఛాలెంజ్ చేశాడు.
"ఆమిర్‌తో మ్యాచ్ ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నా. కానీ అతడు పిల్లాడిని ఎంచుకున్నాడు. నీరజ్ గోయత్ నా జూనియర్. ఇంతకు ముందు చెప్పా, ఇప్పుడు చెబుతున్నా.. అతడు(ఆమిర్) ఎప్పుడు అంటే అప్పుడు పోరుకు సిద్ధంగా ఉన్నా. అతడు పిల్లలతో తలపడడం ఆపాలి" - విజేందర్ సింగ్
ఈ మాటలకు నొచ్చుకున్న నీరజ్ 'పోరుకు సిద్ధమా..' అంటూ విజేందర్కు ట్విట్టర్లో సవాల్ విసిరాడు
" class="align-text-top noRightClick twitterSection" data=""విజేందర్ నన్ను పిల్లవాడు అంటావా.. ఓ ప్రపంచ ఛాంపియన్‌ను తన సొంత దేశంలో ఓడించిన ఏకైక భారత బాక్సర్‌ని నేను. ఈ నవంబరులో నాతో, వికాస్ కృష్ణన్, ఆమిర్‌తో నువ్వు (విజేందర్) తలపడాలని సవాల్ చేస్తున్నా. ఇందుకు నువ్వు సిద్ధమా?" - నీరజ్ గోయత్
Calling me kid @boxervijender I’m the only Indian boxer who has defeated a world champion in his own country #canxu #china. I want you to face @officialvkyadav in me and @amirkingkhan undercard in november this year. Are you ready ? @trboxing #sbl pic.twitter.com/9PrjrhvViD
— Neeraj Goyat (@GoyatNeeraj) July 20, 2019
">Calling me kid @boxervijender I’m the only Indian boxer who has defeated a world champion in his own country #canxu #china. I want you to face @officialvkyadav in me and @amirkingkhan undercard in november this year. Are you ready ? @trboxing #sbl pic.twitter.com/9PrjrhvViD