ETV Bharat / sports

'టోక్యోలో భారత్​ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది' - అభినవ్​ బింద్రా అప్డేట్స్​

ఈ ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్​లో భారత్​ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని.. ఒలింపిక్స్​ గోల్డ్​ మెడలిస్ట్​ అభినవ్​ బింద్రా అన్నారు. భారత అథ్లెట్లు అయిదు లేదా ఆరు పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బింద్రా.

Hopeful of India recording best-ever medal haul in Tokyo Olympics: Bindra
'టోక్యోలో భారత్​ అత్యుత్తమంగా నిలుస్తుంది'
author img

By

Published : Jan 5, 2021, 5:30 AM IST

టోక్యో ఒలంపిక్స్​లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని, పతకాల సంఖ్యలో దేశానికి ఈ క్రీడలు అత్యుత్తమంగా నిలుస్తాయని దిగ్గజ షూటర్​ అభినవ్​ బింద్రా అశాభావం వ్యక్తం చేశారు. భారత్​ తరఫున ఒలంపిక్స్​ వ్యక్తిగత స్వర్ణం గెలిచిన ఏకైక అథ్లెట్​గా కొనసాగుతున్న బింద్రా.. సోమవారం ఓ వెబినార్​లో మాట్లాడారు.

"కొవిడ్​-19 కారణంగా కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఒలింపిక్స్​ చరిత్రలో టోక్యో క్రీడలను మనకు నచ్చినట్టుగా మలుచుకోలేం. కానీ, ఈ ఒలంపిక్స్​లో భారత్​.. అయిదు లేదా ఆరు పతకాలు సాధించి, లండన్​ క్రీడలను వెనక్కి నెడుతుందనే నమ్మకంతో ఉన్నా. ఇవే మన అత్యుత్తమ ఒలింపిక్స్​గా మిగిలి పోనున్నాయి."

- అభినవ్​ బింద్రా, భారత షూటర్​.

ఇదీ చదవండి: క్వీన్స్​ల్యాండ్ మంత్రి వ్యాఖ్యలపై బీసీసీఐ అసహనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.