భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రాకు(Manika Batra News) ఊరట లభించింది. జాతీయ శిక్షణ శిబిరంలో పాల్గొంటేనే అంతర్జాతీయ టోర్నీలకు ఎంపిక చేస్తామనే భారత టీటీ సమాఖ్య(టీటీఎఫ్‌ఐ) నిబంధనపై దిల్లీ హైకోర్టు(Delhi High Court News) గురువారం స్టే విధించింది. అంతే కాకుండా ఈ సమాఖ్యపై, జాతీయ కోచ్‌పై మనిక చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించి ఆ నివేదికను నాలుగు వారాల్లోపు సమర్పించాలని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖను న్యాయమూర్తి జస్టిస్ రేఖ పల్లి ఆదేశించారు. జాతీయ శిక్షణ శిబిరానికి హాజరు కాలేదనే కారణంతో తనను ఆసియా టీటీ ఛాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేయకపోవడం వల్ల మనిక కోర్టును ఆశ్రయించింది.
అంతేకాకుండా గతంలో తాను వ్యక్తిగతంగా శిక్షణ ఇస్తున్న క్రీడాకారిణికి ఒలింపిక్స్ బెర్తు దక్కడం కోసం జాతీయ కోచ్ సౌమ్యదీప్ రాయ్(Manika Batra Soumyadeep Roy).. మనికను ఒలింపిక్ అర్హత మ్యాచ్(Olympic Qualifiers 2021) వదులకోమని ఒత్తిడి తెచ్చినట్లు తన పిటిషన్లో ఆమె పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ రేఖ.. ఓ జాతీయ కోచ్‌పై వచ్చిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగానే ప్లేయర్లు జాతీయ శిబిరానికి రావాలనే కచ్చితమైన నిబంధన విధించడం సరికాదని తెలిపారు. ఈ విషయంపై నివేదిక సమర్పించాలని క్రీడామంత్రిత్వ శాఖ ఆదేసిస్తూ విచారణను ఈ నెల 28కు వాయిదా వేశారు.
ఇదీ చూడండి.. IPL 2021 news: చెన్నై-బెంగళూరు పోరు.. ఫ్యాన్స్‌లో జోరు!