ETV Bharat / sports

అథ్లెట్లకు హరియాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్​ - హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్​

ఒలింపిక్స్​లో పాల్గొంటున్న హరియాణా ఆటగాళ్లకు బంపర్​ ఆఫర్ ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. టోక్యో మెగా ఈవెంట్​లో గోల్డ్​ మెడల్​ సాధిస్తే రూ.6 కోట్లను బహుమతిగా ప్రకటించింది. సిల్వర్​ మెడల్​ సాధించిన వారికి రూ.4 కోట్లు, కాంస్య పతకం గెలిస్తే రూ.2.5 కోట్లను ఇవ్వనున్నట్లు తెలిపింది.

haryana cm, tokyo olympics
హరియాణా సీఎం, టోక్యో ఒలింపిక్స్​
author img

By

Published : Jun 23, 2021, 8:30 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొంటున్న తమ రాష్ట్ర అథ్లెట్లకు బంపర్ ఆఫర్​ ప్రకటించింది హరియాణా ప్రభుత్వం. రానున్న ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధిస్తే.. రూ.6 కోట్లను నజరానాగా ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది.

సిల్వర్​ మెడల్​ గెలిచిన వారికి రూ.4 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.2.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒలింపిక్​ డే సందర్భంగా పాల్గొన్న కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా మంత్రి సందీప్​ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న టోక్యో ఒలింపిక్స్​లో తమ రాష్ట్రం నుంచి 30 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరి శిక్షణ కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున కేటాయించిందని పేర్కొన్నారు.

యువకులను ప్రోత్సహించడానికే..

టోక్యో మెగా ఈవెంట్​లో మెడల్​ విజేతలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​ వెల్లడించారు. రాబోయే రోజుల్లో యువ క్రీడాకారులను ప్రోత్సాహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించినట్లు తెలిపారు. దీని కింద ప్రభుత్వ ఉద్యోగాలలో 3 శాతం రిజర్వేషన్​ను కల్పించనున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పాటుపడుతున్నామని సీఎం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'తెలుగువారికి ఉపకారం చేయాలని ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.