ETV Bharat / sports

షూటింగ్ ప్రపంచకప్​లో భారత్​కు మరో స్వర్ణం

author img

By

Published : Mar 23, 2021, 5:28 PM IST

ఐఎస్​ఎస్​ఎఫ్ ప్రపంచకప్​లో భారత షూటర్లు సత్తా చాటుతున్నారు. స్కీట్​ మిక్స్​డ్​ విభాగంలో మరో స్వర్ణాన్ని సాధించిన భారత జోడీ.. మొత్తం 7 బంగారు పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

Ganemat, Angad combine to win mixed skeet gold at shooting World Cup
స్కీట్​ మిక్స్​డ్ విభాగంలో భారత్​కు స్వర్ణం

దిల్లీ వేదికగా జరుగుతున్న ఐఎస్​ఎస్​ఎఫ్​ ప్రపంచకప్​లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. తాజాగా మరో బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది ఇండియా. స్కీట్​ మిక్స్​డ్​ విభాగంలో భారత షూటర్లు గనేమత్ సెఖోన్-అన్గద్ వీర్ సింగ్ బజ్వా జోడీ.. కజకిస్థాన్​కు చెందిన ఓల్గా పనరినా-అలెగ్జాండర్ యెచెంకో జంటపై 33-29 తేడాతో విజయం సాధించింది. తాజా మెడల్​తో భారత్​ 7 స్వర్ణ పతకాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

మరో మిక్స్​డ్​ జంట ఒక్క పాయింట్​ తేడాతో తృటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. 32 పాయింట్లతో ఖతార్​ జోడీ షార్షానీ-రషీద్​ అహ్మద్​ ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత షూటర్లు పరినాజ్​ ధాలివల్​-మైరాజ్​ అహ్మద్ ఖాన్​ ద్వయం 31 పాయింట్లతో మెడల్​ను కోల్పోయింది.

ఇదీ చదవండి: ప్రపంచకప్: అదరగొట్టిన భారత షూటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.