ETV Bharat / sports

ప్చ్.. ఒలింపిక్స్​లో ఈ స్టార్ ప్లేయర్స్​ను చూడలేం!

మరికొద్ది రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ సమరం ప్రారంభంకానుంది. తమ అభిమాన క్రీడాకారుల ఆటను చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. కానీ కొందరు స్టార్ ప్లేయర్స్ లేకుండానే ఈసారి విశ్వక్రీడలు జరగనున్నాయి. సైనా నెహ్వాల్​తో పాటు ఫెదరర్, నాదల్, నెయ్​మర్​ వంటి అథ్లెట్లు మెగాటోర్నీలో పాల్గొనట్లేదు.

Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : Jul 14, 2021, 5:32 PM IST

ఒలింపిక్స్​లో పతకం సాధించడమేమో కానీ.. ఈ టోర్నీలో పాల్గొనాలని ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆశ పడుతుంటారు. ఆ వేదిక ద్వారా సత్తాచాటాలని భావిస్తుంటారు. అలాగే అభిమాన అథ్లెట్ ఆట కోసం ఫ్యాన్స్ కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ విశ్వసమరంలో ఎందరో అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ ఈసారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన కొందరు స్టార్ ప్లేయర్లు ఈ మెగాటోర్నీకి దూరమయ్యారు. వారి అసమాన పోటీని అభిమానులు మిస్ అవనున్నారు. వారెవరో చూద్దాం.

సైనా నెహ్వాల్

saina
సైనా నెహ్వాల్

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్నే లిఖించుకుంది సైనా నెహ్వాల్. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. జూనియర్ స్థాయి పతకం నుంచి ఒలింపిక్ పతకం వరకు చేరిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. వరుసగా మూడుసార్లు విశ్వక్రీడల్లో పాల్గొన్న సైనా.. ఈసారి మాత్రం టోక్యో ఒలింపిక్స్​కు దూరమైంది. ర్యాంకింగ్స్​లో దిగువన ఉన్న కారణంగా ఈమెతో పాటు కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెగాటోర్నీకి అర్హత సాధించలేకపోయారు. స్పెయిన్​ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ కూడా ఈ పోటీల్లో పాల్గొనట్లేదు. గాయానికి శస్త్ర చికిత్స జరిగిన కారణంగా ఈమె టోర్నీ నుంచి తప్పుకొంది.

ఫెదరర్

federer
ఫెదరర్

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ ఈసారి ఒలింపిక్స్​లో పాల్గొనట్లేదని చెప్పేశాడు. వింబుల్డన్​ టోర్నీ ఆడుతున్న సమయంలో తన మోకాలికి గాయం అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఫెదరర్​ ఇక ఒలింపిక్స్​ ఆడే అవకాశాలు పెద్దగా లేకపోవచ్చు. రోజర్​కు ప్రస్తుతం 39 ఏళ్లు. ఇప్పటికే అతడిని గాయాలు వేధిస్తున్నాయి. ఇంకా.. చాలా ఏళ్లుగా మేజర్ టోర్నీ టైటిళ్లను నెగ్గలేదు. మళ్లీ వచ్చే ఒలింపిక్స్ వరకు అతడు ఫామ్​లో ఉండటం కష్టమే. దీంతో భవిష్యత్ విశ్వక్రీడల్లో ఫెదరర్ ఆటను చూడమే అనుమానమే.

నాదల్

nadal
నాదల్

ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లో జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు మరో టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్. అనంతరం వింబుల్డన్​తో పాటు ఒలింపిక్స్​కూ దూరమవుతున్నట్లు వెల్లడించాడు. 2008, 2016 విశ్వక్రీడల్లో స్పెయిన్ తరఫున స్వర్ణం సాధించాడితడు. ఇప్పటికే గాయాలు ఇబ్బందిపెడుతుండటం వల్ల మెగాటోర్నీకి దూరమవడమే మేలని భావించాడు. నాదల్ ఖాతాలో 20 గ్రాండ్​స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇతడితో పాటు డొమినిక్ థీమ్​ కూడా టోక్యోకు వెళ్లట్లేదని స్పష్టం చేశాడు.

సెరెనా విలియమ్స్

serena
సెరెనా విలియమ్స్

ఒలింపిక్స్ నుంచి తప్పుకొంటున్నట్లు అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్​ ప్రకటించింది. యూఎస్​ ఒలింపిక్ జాబితాలో పేరు లేని కారణంగా ఆమె ఈ మెగా ఈవెంట్​ నుంచి తప్పుకొంది. 2012 లండన్​ ఒలింపిక్స్​లో సింగిల్స్​, డబుల్స్​లో పాల్గొన్న సెరెనా.. రెండు గోల్డ్​ మెడల్స్​ సాధించింది. సిడ్నీ ఒలింపిక్స్​ 2000లో మహిళల డబుల్స్​లో స్వర్ణం గెలిచిందీ​ స్టార్ ప్లేయర్​. 2008 బీజింగ్ ఒలింపిక్స్​లోనూ బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది. తన సోదరి వీనస్​ విలియమ్స్ జతగా డబుల్స్​లో గోల్డ్​ మెడల్స్​ సాధించింది సెరెనా. ఇక రియో వేదికగా 2016 మెగా ఈవెంట్​లో మూడో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే గాయాలతో సతమతమవుతోన్న 39 ఏళ్ల సెరెనా భవిష్యత్​ విశ్వక్రీడల్లోనూ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.

మో ఫరా

mo farah
మో ఫరా

బ్రిటన్​కు చెందిన అథ్లెట్ మో ఫరా(Mo Farah).. తన సుదూర పరుగుతో ఎన్నో రికార్డులు, ఘనతలూ సాధించాడు. చివరగా రియో ఒలింపిక్స్​లో రెండు స్వర్ణాలతో పాటు మొత్తంగా నాలుగుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్​గా నిలిచాడు. కానీ ఈ ఏడాది టోక్యోలో జరగనున్న విశ్వ క్రీడల(Tokyo Olympics)కు కనీసం అర్హత సాధించలేకపోయాడు. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్​లో భాగంగా బ్రిటీష్ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​లో 27ని.28 సెకండ్ల కనీస అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి మెగాక్రీడలకు దూరమయ్యాడు.

నెయ్​మర్

Neymar
నెయ్​మర్

2016 రియో ఒలింపిక్స్​లో బ్రెజిల్​ స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు ఆ దేశ స్టార్ ఫుట్​బాల్ ప్లేయర్ నెయ్​మర్ జూనియర్. ఫైనల్లో పెనాల్టీ కిక్​తో సొంతగడ్డపై జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ ఈసారి టోక్యో ఒలింపిక్స్​ను మిస్ అవబోతున్నాడు. విశ్వక్రీడల్లో పాల్గొనాలనుకున్న స్టార్ ప్లేయర్లకు ఫుట్​బాల్ క్లబ్​లు (PSG) రెడ్ కార్డ్ చూపించాయి. దీంతో ఇతడితో పాటు మహ్మద్ సాలా, ఎంబపే కూడా ఒలింపిక్స్​లో పాల్గొనట్లేదు.

ఇవీ చూడండి

స్నేహితులతో ధోనీ.. ఫొటో వైరల్​

ఐసీసీ సీరియస్​.. పేరు మార్చుకున్న గేల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.