ETV Bharat / sports

ఆ ఛారిటీ కార్యక్రమంలో నాకు వైరస్​ సోకలేదు - Formula One Racer Lewis Hamilton news

ఫార్ములావన్‌ డ్రైవర్​ లూయీ​ హామిల్టన్​కు కరోనా సోకిందని ఇటీవలే వార్తలొచ్చాయి. ఓ ఛారిటీ కార్యక్రమానికి ఈ రేసర్ హాజరవగా.. అందులో పాల్గొన్న ఇద్దరికి కరోనా​ సోకడం వల్ల పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వాటిపై స్పష్టతనిచ్చాడు హామిల్టన్​.

Formula One Racer Lewis Hamilton
ఆ ఛారిటీ మ్యాచ్​లో నాకు వైరస్​ సోకలేదు
author img

By

Published : Mar 22, 2020, 5:43 AM IST

ఫార్ములావన్​ ఛాంపియన్​ లూయీ​ హామిల్టన్​ తనకు కరోనా వైరస్​ సోకలేదని స్పష్టం చేశాడు. ఇప్పటికే వారం రోజుల నుంచి స్వీయ నిర్బంధంలో ఉన్నానని చెప్పాడు. ఇటీవల లండన్​లో ఓ ఛారిటీ కార్యక్రమానికి హాజరయ్యాడు హామిల్టన్​. అదే వేడుకకు హాలీవుడ్​ నటి ఇడ్రిస్​ ఎల్బా, కెనడా ప్రధాని భార్య సోఫీ గ్రిగెర్​ ట్రూడో వచ్చారు. వీరిద్దరికీ కరోనా పాజిటివ్​ అని ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో తేలింది. ఫలితంగా ఇతడికీ ఆ వైరస్​ సోకిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపై స్పందించాడు.

Formula One Racer Lewis Hamilton
ఫార్ములావన్‌ రేసర్​ లూయిస్​ హామిల్టన్​​

" నాలో వైరస్​కు సంబంధించిన ఒక్క లక్షణమూ కనిపించట్లేదు. అయినా స్వీయ నియంత్రణలో భాగంగా వారం రోజులుగా ఐసోలేషన్​లో ఉన్నాను. ఆస్ట్రేలియా గ్రాండ్​ ప్రీ రద్దయిన తర్వాత ఈనెల 13 నుంచి ఈ ప్రక్రియలో పాల్గొన్నాను"

-- హామిల్టన్​, ఫార్ములావన్​ రేసర్

ఎఫ్‌-1 డ్రైవర్లకు వర్చువల్‌ రేసులు

కరోనా వైరస్‌ కారణంగా ఫార్ములావన్‌ రేసులు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం ఎఫ్‌-1 డ్రైవర్లు వర్చువల్‌ రియాలిటీ రేసుల్లో పోటీపడనున్నారు. అభిమానులు ఎఫ్‌-1 రేసులను చూసే అవకాశాన్ని కోల్పోతున్న భావన కలగకుండా.. జూన్‌ 7 నుంచి ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా అజర్‌ బైజాన్‌లో తొలి ఈ-స్పోర్ట్స్‌ రేసు జరగబోతోంది. గ్రాండ్‌ప్రీ రేసులో మాదిరిగానే 90 నిమిషాల పాటు ఆడే ఈ పోటీల్లో 28 ల్యాప్‌లు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.