ETV Bharat / sports

దిగ్గజ ఫుట్​బాల్​​ ప్లేయర్ కన్నుమూత

Surajit Sengupta Footballer: ఫుట్​బాల్​ మాజీ ఆటగాడు సురజిత్​ సేన్​గుప్తా గురువారం మరణించారు. గత కొంతకాలంగా కరోనా కారణంగా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గతంలో ఆయన భారత ఫుట్​బాల్ జట్టుకు మిడ్​ ఫీల్డర్​గా సేవలు అందించారు.

author img

By

Published : Feb 17, 2022, 5:09 PM IST

Surajit Sengupta
సురజిత్​ సేన్​ గుప్తా

Surajit Sengupta Footballer: ఫుట్​బాల్​ దిగ్గజం, భారత మాజీ ఆటగాడు సురజిత్​ సేన్​గుప్తా (71) గురువారం కన్నుమూశారు. కొవిడ్​ బారిన పడిన ఆయన కోల్​కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత జట్టుకు సురజిత్​ మిడ్​ ఫీల్డర్​గా సేవలు అందించారు.

సురజిత్​ మృతిపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. "ఓ స్టార్ ఫుట్​బాలర్​ను ఈరోజు కోల్పోయాం. ఫుట్​బాల్​ అభిమానులు ఆరాధించే మేటి జాతీయ ఆటగాడు సురజిత్​. ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు. ఆయనకు నా నివాళి." అని మమత ట్వీట్​ చేశారు.

కొవిడ్​ పాజిటివ్​గా తేలడంతో సురజిత్​ జనవరి 23న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల గత వారం నుంచి వెంటిలేటర్​ సాయంతో ఆయనకు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడం వల్ల గురువారం తుది శ్వాస విడిచారు.

1951, ఆగస్టు 30న జన్మించిన సురజిత్​ సేన్​గుప్తా.. కిద్దెర్​పోర్​ క్లబ్​లో తన కెరీర్​ను ప్రారంభించారు. ఆ తర్వాత కోల్​కతాలోని మూడు ప్రధాన క్లబ్​లకు ప్రాతినిధ్యం వహించారు. మోహున్​ బగన్​, ఈస్ట్​ బంగాల్​, మహమ్మదన్ స్పోర్టింగ్​ జట్లకు ఆడారు.

1970 ఏషియన్​ గేమ్స్​లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించడంలో తన వంతు కృషి చేశారు సురజిత్​. ఈస్ట్​ బంగాల్​ జట్టును సాటిలేని టీమ్​గా తీర్చిదిద్దడంలో సురజిత్​ కీలక పాత్ర పోషించారు. ఈస్ట్​బంగాల్​ జట్టు గోల్డెన్ ఎరాగాలో సురజిత్​ భాగం. ఆ సమయంలో కోల్​కతా ఫుట్​బాల్​ లీగ్​లో (1970-1976) వరుస టైటిళ్లు, ఆరు సార్లు ఐఎఫ్​ఏ షీల్డ్​, మూడు సార్లు దురంద్​ కప్​ను గెలుచుకుంది.

ఇదీ చూడండి : చెలరేగిన నరైన్​.. యూవీ ప్రపంచ రికార్డు జస్ట్​ మిస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.