ETV Bharat / sports

యుగానికి ఒక్కడు ఈ 'పీలే'.. ఆ ఘనతలన్నీ అతనికే సొంతం

author img

By

Published : Dec 31, 2022, 10:28 AM IST

అసమాన ఆటతీరుతో బ్రెజిల్‌కు ఎన్నో అద్భుత విజ‌యాల్ని అందించిన దిగ్గజ ఫుట్​బాలర్​ పీలే.. గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్‌లో పీలే సాధించిన ఘనతుల, రికార్డులు తెలుసుకోవడం సహా అతడు గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

football star pele records
యుగానికి ఒక్కడు ఈ 'పీలే'.. ఆ ఘనతలన్నీ అతనికే సొంతం

ప్రపంచంలో అత్యంత ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాల్‌. రెండొందల దేశాలు ఆడే.. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆట.. కోట్లమంది ఆటగాళ్లను చూసింది. ఆ కోట్ల మందిలో అత్యుత్తమ ఆటగాడు ఎవరంటే..? ముక్తకంఠంతో చెప్పే పేరు.. పీలే!
మారడోనాను పిచ్చిగా ప్రేమించేవాళ్లు.. రొనాల్డో అంటే పడిచచ్చేవాళ్లు.. మెస్సి ఆరాధకులు.. అందరూ ఇష్టపడే, గౌరవించే ఆటగాడు.. పీలే!
ఒక ఆటగాడు ఫ్రీకిక్‌ కొట్టడంలో నిపుణుడై ఉండొచ్చు.. మరో ఆటగాడు కార్నర్‌ కిక్‌ ఆడడంలో నేర్పరి అయి ఉండొచ్చు.. ఒకరికి డ్రిబ్లింగ్‌లో తిరుగులేకపోవచ్చు.. మరొకరికి పెనాల్టీ కిక్‌ బాగా ఆడడంలో ప్రతిభ ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఒక్క ఆటగాడిలో ఉంటే..? అతనే.. పీలే!
ఇప్పుడు ఆధునికత అద్దుకున్న ఆటలో ఫుట్‌బాలర్లు చేస్తున్న ప్రతి విన్యాసాన్ని దశాబ్దాల కిందటే కళ్లకు కట్టిన మేధావి.. పీలే!
బ్రెజిల్‌ అనే దేశాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది.. ఫుట్‌బాల్‌ అనగానే ఆ దేశం, ఆ దేశం పేరెత్తగానే ఫుట్‌బాల్‌ గుర్తుకొచ్చేలా చేసింది.. పీలే!
ఫుట్‌బాల్‌లో ఎంత అందముందో.. ఆ ఆటను ఎంత అందంగా ఆడొచ్చో.. ఒక ఆటగాడు మైదానంలో ఎన్నెన్ని విన్యాసాలు చేయొచ్చో ప్రపంచానికి చూపించి.. దశాబ్దాల తర్వాత ఇప్పుడు చూసినా తన విన్యాసాలకు అబ్బురపడే నైపుణ్యం చూపించిన అరుదైన సాకర్‌ నిపుణుడు.. పీలే!
ఆటతో అందలం ఎక్కేవాళ్లు ఎందరో! కానీ తమ నైపుణ్యంతో ఆ ఆటనే అందలం ఎక్కించేవాళ్లు అరుదు. ఆ కోవకు చెందినోడే.. పీలే!
ఆటల్లో ఫుట్‌బాల్‌ రాజు అయితే.. ఆ ఆటలో రాజు పీలే!

.

ది గ్రేటెస్ట్​ పీలే 1940-2022.. ఎడ్సన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో.. ఇలా చెప్తే బహుశా అతనెవరూ అన్నది చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ పీలే అంటే తెలియని క్రీడాభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆల్‌టైమ్‌ దిగ్గజంగా మన్ననలు అందుకుంటున్న మేటి. ‘అత్యంత గొప్ప ఆటగాడు (ది గ్రేటెస్ట్‌)’ అని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య అతణ్ని కీర్తించింది. 20వ శతాబ్దపు మేటి ఆటగాడు అతనేనని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ప్రకటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కలికితురాళ్లు అతని కీర్తి కిరీటాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చాయి. తన కెరీర్‌లో సాంటోస్‌, న్యూయార్క్‌ కాస్మోస్‌ క్లబ్‌లు, బ్రెజిల్‌ తరపున అతను ఆడాడు.

తండ్రి బాటలో.. పీలే తండ్రి డొండినో కూడా ఫుట్‌బాల్‌ ఆటగాడే. అట్లెటికో మినెరో, ఫ్లమినెన్స్‌ లాంటి క్లబ్‌లకు ఆడిన అతను.. బ్రెజిల్‌కు మాత్రం ప్రాతినిథ్యం వహించలేకపోయాడు. దీంతో ఇద్దరు పిల్లల్లో పెద్దవాడైన పీలేను ఫుట్‌బాల్‌ వైపు నడిపించాడు. సావ్‌ పాలోలోని బావురు నగరంలో పీలే పెరిగాడు. పేదరికం అనుభవించాడు. టీ కొట్టులో పనిచేశాడు. ఆటలో తండ్రి శిక్షణ ఇస్తున్నా సరైన ఫుట్‌బాల్‌ కొనుక్కోవడానికి అతని దగ్గర డబ్బు లేదు. వార్తాపత్రికలను ఓ సాక్సులో బంతిలా చుట్టుకుని లేదా దబ్బపండు (గ్రేప్‌ఫ్రూట్‌)తో ఆడేవాడు. క్రమంగా ఆటపై పట్టు సాధించాడు. 14 ఏళ్లకే సీనియర్లతో తలపడేవాడు. 15 ఏళ్లకే అతనికి సాంటోస్‌ క్లబ్‌కు ఆడే అవకాశం వచ్చింది.ఆ తర్వాతి ఏడాదే అతను బ్రెజిల్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అక్కడి నుంచి అతని శకం మొదలైంది. పీలే 1958, 1962, 1970 ప్రపంచకప్‌లు అందుకున్నాడు.

.

అవన్నీ అతనికే సొంతం.. బంతిని తన్నుతూ పీలే పరుగెత్తుతుంటే.. పల్లాన్ని వెతుక్కుంటూ నీళ్లు పరవళ్లు తొక్కినట్లుగా ఉండేది. ప్రత్యర్థి ఆటగాళ్లకు దొరకకుండా తప్పిస్తూ.. వాళ్ల కళ్లుగప్పి క్షణాల్లో బంతిని గోల్‌పోస్టులోకి పంపిస్తుంటే.. కుంచెతో కళాకారుడు చిత్రాన్ని గీస్తున్నట్లుగా ఉండేది. స్వచ్ఛమైన నైపుణ్యాలతో ఆటకు అందాన్ని అద్ది.. అతనూ అందలానికి చేరాడు. అతనో పరిపూర్ణ ఆటగాడు. రెండు కాళ్లతోనూ గోల్స్‌ కొట్టడం, ప్రత్యర్థి ఆటగాళ్లను బోల్తా కొట్టిస్తూ డ్రిబ్లింగ్‌ చేయడం, మెరుపు వేగంతో బంతిని నెట్‌లోకి పంపించడం, హెడర్‌తో బంతి దిశను మార్చడం, అమోఘమైన శక్తితో మైదానంలో ఉత్సాహాన్ని నింపడం.. ఇలా అతని ఉనికి ఆటను ఆకర్షణీయంగా మార్చింది. గణాంకాలను సవరిస్తూ.. రికార్డులు సృష్టిస్తూ.. 21 ఏళ్లపాటు అద్భుతమైన కెరీర్‌ కొనసాగించి దాదాపు 1300కు పైగా మ్యాచ్‌ల్లో సుమారు 1200కు పైగా గోల్స్‌ చేశాడు. 5.8 అడుగుల ఎత్తుతో.. మైదానంలో చురుగ్గా కదిలి అన్ని విభాగాల్లోనూ అసామాన్య ప్రతిభ కనబరిచాడు. అతనిలో ఓ ఫార్వర్డ్‌, అటాకర్‌, వింగర్‌, డిఫెండర్‌, గోల్‌కీపర్‌ ఉండేవాడు. బంతిపై అతని నియంత్రణ అద్భుతం. బంతిపై పట్టు వదలకుండా.. వేగాన్ని కొనసాగిస్తూ.. బలమైన దేహం కారణంగా ప్రత్యర్థులకు చిక్కకుండా సాగిపోయేవాడు. స్వతహాగా కుడి కాలితో ఆడే పీలే.. ఎడమ కాలితోనూ అదే స్థాయిలో ఆడేలా నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నాడు. బంతిని సరిగ్గా అంచనా వేస్తూ.. గాలిలోకి ఎగిరే అతని టైమింగ్‌కు వావ్‌ అనక తప్పదు. 13 ఏళ్లకే స్థానిక జూనియర్‌ జట్టుకు ఆడడం మొదలెట్టినప్పటి నుంచి 37 ఏళ్ల వయసులో చివరి మ్యాచ్‌ ఆడేంతవరకూ అదే తపన, పట్టుదల, అంకితభావం, నిబద్ధత ప్రదర్శించాడు. మోకాలి గాయం బాధిస్తున్నా 1958 ప్రపంచకప్‌లో ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు సాంటోస్‌ క్లబ్‌ తరపునా అదరగొట్టాడు. అతనికున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని సాంటోస్‌ క్లబ్‌ ప్రపంచవ్యాప్తంగా పర్యటించేది. 1970లో మూడోసారి ప్రపంచకప్‌ ముద్దాడిన తర్వాతి ఏడాది యుగోస్లోవియాతో మ్యాచ్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుత అగ్రశ్రేణి ఆటగాళ్లు మెస్సి, రొనాల్డో, ఎంబాపెను కలబోస్తే పీలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ముగ్గురిలో ప్రత్యేకంగా ఉన్న డ్రిబ్లింగ్‌ నైపుణ్యాలు, శక్తి, వేగం.. ఒక్క పీలేలోనే కనిపించేవి. అందుకే అతనెప్పటికీ సాకర్‌ కింగ్‌!

అలా పీలేగా.. ఎడ్సన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో ఇది పీలే అసలు పేరు. ఐతే స్థానిక వాస్కోడగామా జట్టు గోల్‌కీపర్‌ ‘బిలే’ను అతను అభిమానించేవాడు. ఆ పేరును పొరపాటుగా పీలే అని ఉచ్చరించేవాడు. దీంతో పాఠశాలలో అతని స్నేహితులు ఎడ్సన్‌ను పీలే అని పిలిచేవాళ్లు. చివరకు ఆ పేరుతోనే ఆదరణ పొందాడు.

.

‘‘ఒక రోజు మనిద్దరం కలిసి ఆకాశంలో ఫుట్‌బాల్‌ ఆడతామని ఆశిస్తున్నా’’
మారడోనా చనిపోయినపుడు పీలే
‘‘పీలే మరణం కేవలం ఫుట్‌బాల్‌కే కాదు క్రీడా ప్రపంచానికి తీరని లోటు. అలాంటి ఆటగాడు మరొకరు ఉండరు. అతని ఘన వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుంది’’

సచిన్‌

* పీలే కెరీర్‌లో 1000వ గోల్‌ చేసిన నవంబర్‌ 19 (1969)ని సాంటోస్‌లో ప్రతి ఏడాది ‘పీలే రోజు’గా నిర్వహిస్తారు.

స్ఫూర్తి మంత్రం..

.

పీలే కేవలం ఓ దిగ్గజ ఆటగాడు మాత్రమే కాదు. అలా మిగిలిపోయుంటే అతని గురించి ఇంతలా చెప్పుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. అతనో స్ఫూర్తి మంత్రం. ప్రపంచ క్రీడా తారగా వెలిగిన తొలి నల్లజాతీయుడు బహుశా అతనే కావొచ్చు. ఆశయం కోసం సంకల్పంతో కృషి చేస్తే.. శిఖరాలను అధిరోహించొచ్చు అని చాటిన మేరునగధీరుడు అతను. నల్లజాతీయులకు అనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణ కలిగించాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కూడా వివిధ కార్యక్రమాలతో మన్నన పొందాడు. అందుకే అతని మరణంతో ప్రపంచం బాధలో మునిగిపోయింది. గల్లీ ఫుట్‌బాల్‌ ఆటగాడి నుంచి అంతర్జాతీయ సూపర్‌ స్టార్ల వరకూ.. వీధి నాయకుడి నుంచి ప్రపంచ దేశాల అధ్యక్షుల వరకూ అతణ్ని స్మరిస్తూ నివాళులు అర్పించారు.

ఆటకు అందాన్ని అద్ది.. సావ్‌పాలో: ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే అంత్యక్రియలు అతని స్వస్థలం సాంటోస్‌లో జరగనున్నాయి. సాకర్‌ మేటి ఆటగాడిగా ఎదిగిన 82 ఏళ్ల పీలే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్‌తో సుదీర్ఘ కాలం పోరాటం చేసిన అతను.. చివరకు తుదిశ్వాస విడిచాడు. అతని పార్థీవ దేహాన్ని సోమవారం ఉదయం అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఆసుపత్రి నుంచి తరలించి.. విలా బెల్మిరో స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మంగళవారం సాంటోస్‌ వీధుల గుండా అంతిమ యాత్ర నిర్వహిస్తారు. మంచాన పడ్డ తన 100 ఏళ్ల తల్లి నివాసం ముందు నుంచి పీలే భౌతిక కాయాన్ని తరలిస్తారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు.

యుద్ధాన్ని ఆపి మరీ.. పీలే మ్యాచ్‌ కోసం తీవ్రంగా సాగుతున్న యుద్ధాన్ని 48 గంటల పాటు ఆపేశారట! 1967లో నైజీరియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ బియాఫ్రా మధ్య అంతర్యుద్ధం మొదలైంది. 1969లో లాగోస్‌లో మ్యాచ్‌ ఆడేందుకు పీలేతో కూడిన సాంటోస్‌ జట్టు వెళ్లింది. ఇంకా యుద్ధం కొనసాగుతుండగా.. సూపర్‌ ఈగల్స్‌తో సాంటోస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌ కోసం ఆ యుద్ధానికి రెండు రోజుల పాటు సైనికులు విరామం ఇచ్చారట.

రికార్డుల చిరునామా..

.

మైదానంలో ఆటతో అదరగొట్టిన పీలే రికార్డుల చిరునామాగా మారాడు. మూడు ప్రపంచకప్‌ (1958, 1962, 1970)లు గెలిచిన ఏకైక ఆటగాడు అతనే. ఈ ఏడాది ప్రపంచకప్‌ ముందు వరకూ బ్రెజిల్‌ తరపున అత్యధిక గోల్స్‌ (77) చేసిన ఆటగాడిగానూ కొనసాగాడు. కానీ ఇప్పుడు అతని సరసన నెయ్‌మార్‌ చేరాడు. 16 ఏళ్ల తొమ్మిది నెలలకే అంతర్జాతీయ గోల్‌ కొట్టి.. బ్రెజిల్‌ తరపున అతిపిన్న వయస్సులో గోల్‌ చేసిన ఆటగాడిగా అతను నిలిచాడు. ప్రపంచకప్‌లో గోల్‌ చేసిన, హ్యాట్రిక్‌ కొట్టిన, ఫైనల్‌ ఆడిన, ఫైనల్లో గోల్‌ చేసిన, ప్రపంచకప్‌ గెలిచిన.. ఇలా అత్యంత పిన్న వయస్సు ఆటగాడిగా ఎన్నో రికార్డులు మూటగట్టుకున్నాడు. అత్యధిక కెరీర్‌ గోల్స్‌తో గిన్నిస్‌ బుక్‌ రికార్డు సొంతం చేసుకున్నాడు.

‘‘పీలే మరణంతో ప్రపంచ క్రీడా రంగంలో భర్తీ చేయలేని శూన్యం ఏర్పడింది. అతనో ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌స్టార్‌. అతని ప్రజాదరణ హద్దులను అధిగమించింది.’’
ప్రధాని మోదీ

క్రీడా మంత్రిగా.. 1995లో పీలేను క్రీడామంత్రిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు ఫెర్నాండో హెన్రిక్‌ నియమించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌లో అవినీతి తగ్గించేందుకు అతను ఓ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. దీన్ని ‘పీలే చట్టం’ అని పిలుస్తుంటారు. పీలే కొన్ని చిత్రాల్లో నటించాడు.‘ పీలే’ (1977)తో పాటు కొన్ని చిత్రాలకు సౌండ్‌ ట్రాక్‌ అందించాడు.

గోల్స్‌ లెక్కల్లో..

పీలే కెరీర్‌ గోల్స్‌ సంఖ్యపై గందరగోళం నెలకొంది. 1,366 మ్యాచ్‌ల్లో 1,283 గోల్స్‌ చేశానని పీలే చెప్పాడు. కానీ ఫిఫా అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం 1,363 మ్యాచ్‌ల్లో అతను 1,281 గోల్స్‌ చేశాడు. అందులో అనధికార, స్నేహపూర్వక మ్యాచ్‌లూ ఉన్నాయి. గిన్నిస్‌ ప్రపంచ రికార్డు ప్రకారం అతను 1,363 మ్యాచ్‌ల్లో 1,279 గోల్స్‌ చేసినట్లుగా ఉంది. బ్రెజిల్‌ తరపున 92 మ్యాచ్‌ల్లో 77 గోల్స్‌ కొట్టాడు.
* 1977లో కాస్మోస్‌, సాంటోస్‌ మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌తో పీలే ఆటకు వీడ్కోలు పలికాడు. ఆ మ్యాచ్‌లో రెండు జట్ల తరపునా అతనాడడం విశేషం. ఆ మ్యాచ్‌ ద్వితీయార్ధంలో వర్షం పడింది. దీంతో పీలే ఆటకు వీడ్కోలు పలుకుతుంటే ఆకాశం కూడా కన్నీళ్లు పెట్టుకుందనే శీర్షికలతో వార్తలు వచ్చాయి.

భారత్‌లో ఇలా..

.

పీలే 1977లో ఈడెన్‌ గార్డెన్స్‌లో ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ కోసం భారత్‌కు వచ్చాడు. అప్పుడు మోహన్‌ బగాన్‌తో న్యూయార్క్‌ కాస్మోస్‌ తలపడింది. పీలేను చూసేందుకు దాదాపు 90 వేల మంది అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఆ మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది. మళ్లీ 2015లో భారత్‌కు వచ్చాడు. అప్పుడు కోల్‌కతాలో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. భారత ఫుట్‌బాల్‌ మెరుగయ్యేందుకు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. 11 రోజుల ముందుగానే అక్టోబర్‌ 12న పీలే 75వ జన్మదిన వేడుకలను నేతాజీ స్టేడియంలో నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, గంగూలీ తదితరులు పాల్గొన్నారు. దిల్లీలో సుబ్రతో కప్‌ అండర్‌-17 బాలుర ఫైనల్‌ మ్యాచ్‌కూ పీలే హాజరయ్యాడు. 2018లో అతను మళ్లీ దిల్లీకి వచ్చినప్పటికీ ఓ కార్యక్రమానికి హాజరై వెళ్లిపోయాడు.

..

.

రొనాల్డో, మెస్సీతో

* రియల్‌ మాడ్రిడ్‌, జువెంచస్‌, మాంచెస్టర్‌ యునైటెడ్‌, వాలెన్సియా సీఎఫ్‌, ఇంటర్‌ మిలాన్‌ లాంటి క్లబ్‌లు అతణ్ని తమ జట్టు తరపున ఆడించాలని ప్రయత్నించాయి. కానీ 1961లో అప్పటి బ్రెజిల్‌ అధ్యక్షుడు జానియో కాడ్రోస్‌.. పీలేను ‘అధికారిక జాతీయ నిధి’గా ప్రకటించి అతణ్ని దేశం వెలుపల క్లబ్‌లకు ఆడకుండా చేశారు. కానీ 1974లో బ్రెజిల్‌ క్లబ్‌ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత 1975 నుంచి 1977 వరకు అతను న్యూయార్క్‌ కాస్మోస్‌కు ఆడాడు.

ఇదీ చూడండి: 127 గోల్స్ పర్​ ఇయర్​.. పీలే సాధించిన రికార్డులు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.