ETV Bharat / sports

పారాలింపిక్స్​లో భారత తొలి స్వర్ణం వెనుక అంత కథ ఉందా! - india's first gold medal

మీరు ఎప్పుడైన యాక్షన్​, డ్రామా, ఎమోషన్స్​తో పాటు మరెన్నో ట్విస్ట్స్​ ఉన్న సినిమాలను చూశారా? చూసే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చిత్రసీమలో సర్వసాధారణం. ఇదే స్క్రీన్​ప్లేతో ఒక వ్యక్తి జీవితంలోని పరిణామాలు జరిగితే? ఊహించుకోవడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, మీరు విన్నది నిజమే!.. ఇలాంటి స్క్రీన్​ప్లేనే పారా-అథ్లెట్​ మురళీకాంత్​ పెట్కార్​ జీవితంలో జరిగింది. పారాలింపిక్స్​లో మన దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని తెచ్చిన ఘనత ఈయన సొంతం. అయితే మురళీకాంత్​ గతం ఏంటి? ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలు ఏంటి?

First Indian to Win Gold Medal in Paralympics History
పారాలింపిక్స్​లో భారత తొలి స్వర్ణ పతక విజేత ఎవరో తెలుసా?త
author img

By

Published : Sep 22, 2021, 1:52 PM IST

సినిమా అంటే కొన్ని యాక్షన్స్​ సీన్స్​.. రొమాంటిక్​ సన్నివేశాలతో కలగలపిన ఎమోషన్స్​తో మరెన్నో ట్విస్ట్​లు చూస్తుంటాం! అలాంటి సినిమాను తలపించే కొన్ని పరిస్థితులు ఓ వ్యక్తి జీవితంలో ఎదురయ్యాయి. భారత ఆర్మీలో పనిచేసిన సుబేదార్​.. పారాలింపిక్స్​లో భారత్​కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన క్రీడాకారుడు. ఆయనే మురళీకాంత్​ పెట్కార్​. ఈయన జీవతంలో ఎదురైన పరిణామాలు సినిమాల్లో స్క్రీన్​ప్లేను తలపిస్తుంది. మురళీకాంత్​ జీవితంలోని ట్విస్ట్​లు.. దర్శకుడు పూరీ జగన్నాథ్​నూ విస్తుపోయేలా చేయడం ఖాయం! ఇంతకీ ఈ మురళీకాంత్​ పెట్కార్​ ఎవరు? అతడి జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులేంటి? ఆర్మీలో పనిచేసిన మురళీకాంత్​.. పారా-అథ్లెట్​గా ఎలా మారాడో తెలుసుకుందాం.

భారత్​కు తొలి స్వర్ణం

ఇటీవల కాలంలో అథ్లెట్ల జీవితంలో ఇంతటి ట్విస్ట్​లు ఎక్కడా జరిగి ఉండవు. మురళీకాంత్​ పెట్కార్​ అనే అథ్లెట్​.. పారాలింపిక్స్​లో భారత్​కు తొలి స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. 1972లో జరిగిన హైడెల్​బర్గ్​ గేమ్స్​లో 50మీ. ఫ్రీస్టైల్​ స్విమ్మింగ్​లో నెగ్గి ప్రపంచ రికార్డును సృష్టించాడు. అసలు ఈ మురళీకాంత్​ ఎవరు? అతడి జీవితంలో ఎదురైన ట్విస్ట్​ల గురించి తెలుసుకుందాం.

మురళీకాంత్​ పెట్కార్​.. భారత ఆర్మీలో సుబేదార్​గా పనిచేశాడు. 1965లో జరిగిన భారత్​-పాక్​ యుద్ధంలో ఆయనకు 9 తూటాలు తగిలాయి. వాటిలో ఒక బుల్లెట్​ ఇప్పటికి అతడి వెన్నెముకలోనే ఉంది. ఈ ఘటన తర్వాత మురళీకాంత్ పక్షవాతానికి గురయ్యాడు. అలా దాదాపుగా రెండేళ్ల తర్వాత తన జ్ఞాపకశక్తినీ కోల్పోయాడు. కానీ, ఈ సంఘటన అతడిలోని ధైర్వవంతుడిని ఆపలేకపోయింది.

నిజంగా చెప్పాలంటే.. ఆ ప్రమాదం తర్వాతే అతడిలో పట్టుదల పెరిగింది. అథ్లెట్​గా మారి.. 1972లో జరిగిన పారాలింపిక్స్​లో భారత్​కు తొలి స్వర్ణాన్ని తెచ్చిపెట్టాడు. అయితే స్విమ్మింగ్​లో సత్తా చాటడమే కాకుండా.. జావెలిన్​ త్రో ఫైనలిస్టుల్లో ఒకడిగా నిలిచాడు. దీంతో పాటు స్కేటింగ్​లోనూ పోటీపడ్డాడు.

పారాలింపిక్స్ చరిత్రలో తొలిసారి..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోక్యోలో జరిగిన పారాలింపిక్స్​లో భారత్ అదరగొట్టేసింది.​ చరిత్రలో లేనంత అత్యుత్తమ ప్రదర్శనతో తమ ప్రయాణాన్ని ముగించింది. ఇటీవలే ఉత్కంఠంగా సాగిన ఈ పోటీల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశప్రజల మనసులు గెలుచుకున్నారు. పారాలింపిక్స్​ చరిత్రలోనే ఎక్కువ పతకాలు(19) సాధించి దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.

ఇదీ చూడండి.. IPL 2021: రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.