ETV Bharat / sports

Fifa worldcup 2022: విశ్వ విజేత బంగారు బాబు ఎవరో? - ఫిఫా వరల్డ్ కప్​ ఫైనల్​

ఫిఫా వరల్డ్ కప్​ 2022 ఆఖరి అంకానికి చేరుకుంది. మరో రోజు విశ్వ విజేత ఎవరో తేలిపోనుంది.

Fifa worldcup 2022 final
విశ్వ విజేత బంగారు బాబు ఎవరో?
author img

By

Published : Dec 17, 2022, 11:00 AM IST

సాకర్‌ సమరంలో విశ్వ విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోనుంది. ఆదివారం ఆఖరి పోరులో అర్జెంటీనాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ తలపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ ఫైనల్‌ సమరం రేపే. కప్పు అందుకోవాలన్న మెస్సి కల నెరవేరుతుందా? ఫ్రాన్స్‌ వరుసగా రెండో సారి టైటిల్‌ సాధిస్తుందా.. ఇలా చర్చలు జోరందుకున్నాయి.

ఈ క్రమంలోనే మెగా టోర్నీలో అత్యధిక గోల్స్‌తో బంగారు బూటు దక్కించుకునే ఆటగాడు ఎవరా? అన్న ఆసక్తి నెలకొంది. ఈ రేసులో అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సి, ఫ్రాన్స్‌ స్టార్‌ ఆటగాడు ఎంబాపె ముందు వరుసలో ఉన్నారు. తమ జట్లు తుదిపోరు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ అగ్రశ్రేణి ఆటగాళ్లు.. చెరో అయిదు గోల్స్‌తో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. మరి వీళ్లిద్దరిలో ఫైనల్లో ఏ ఆటగాడు గోల్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్తాడో చూడాలి. అల్వారెజ్‌ (అర్జెంటీనా), ఒలీవర్‌ గిరూడ్‌ (ఫ్రాన్స్‌) చెరో నాలుగు గోల్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా.. మెస్సి, ఎంబాపెను దాటి బంగారు బూటు గెలుచుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి: రెండో టెస్టుకు రోహిత్ రెడీ.. మరి తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.