'ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి'లో స్వర్ణం గెలిచింది భారత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి. స్కోల్కోవో వేదికగా ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ జు వెంజున్(చైనా)పై గెలిచింది. 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది హంపి.
-
Koneru Humpy 🇮🇳 wins FIDE Women's Grand Prix in Skolkovo and takes home 15,000 Euro first prize and 160 WGP points.
— International Chess Federation (@FIDE_chess) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Official website of the Series: https://t.co/WT3dzmqT5K#WomenGrandPrixFIDE #FIDE #India pic.twitter.com/g9f1GN91Vs
">Koneru Humpy 🇮🇳 wins FIDE Women's Grand Prix in Skolkovo and takes home 15,000 Euro first prize and 160 WGP points.
— International Chess Federation (@FIDE_chess) September 22, 2019
Official website of the Series: https://t.co/WT3dzmqT5K#WomenGrandPrixFIDE #FIDE #India pic.twitter.com/g9f1GN91VsKoneru Humpy 🇮🇳 wins FIDE Women's Grand Prix in Skolkovo and takes home 15,000 Euro first prize and 160 WGP points.
— International Chess Federation (@FIDE_chess) September 22, 2019
Official website of the Series: https://t.co/WT3dzmqT5K#WomenGrandPrixFIDE #FIDE #India pic.twitter.com/g9f1GN91Vs
పెళ్లి తర్వాత మళ్లీ...
1987 మార్చి 31న ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో పుట్టిన కోనేరు హంపి... భారత నుంచి అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా పేరు సంపాదించింది. 15 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్‌గా హోదా సాధించింది. పిన్నవయస్సులోనే మహిళా గ్రాండ్ మాస్టర్‌గా చరిత్ర సృష్టించింది.
2007లో ఈఎల్వో రేటింగ్‌లో 2600 పాయింట్లకు పైగా సంపాదించి... జుడిట్ పోల్గర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించింది. 2014లో పెళ్లి తర్వాత కొన్నేళ్లు ఆటకు విరామం ప్రకటించింది. మళ్లీ రీఎంట్రీలో గ్రాండ్ ప్రి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది హంపి. ఇందులో విజేతగా నిలవడం వల్ల 160 పాయింట్లు సహా 15 వేల యూరోల(రూ.11 లక్షల 76వేలు) ప్రైజ్‌మనీ గెలుచుకుంది.