ETV Bharat / sports

ఎక్స్​క్లూజివ్: 'ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధిస్తా'

author img

By

Published : Jun 15, 2020, 4:08 PM IST

2008 బీజింగ్ ఒలింపిక్స్​లో భారత్​కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని అందించాడు షూటర్​ అభినవ్​ బింద్రా. ఆ తర్వాత రెండో వ్యక్తిగత స్వర్ణం ఎవరు తీసుకొస్తారా? అని దేశమంతా ఎదురుచూస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ ఆశలన్నీ ప్రముఖ రెజ్లర్​ భజరంగ్​ పునియా మీదే ఉన్నాయి. మరి ఈ కలను అతడు నెరవేరుస్తాడా? అందుకోసం ఎలా సన్నద్ధమవుతున్నాడు? వంటి విశేషాలపై 'ఈటీవీ-భారత్'​తో ఎక్స్​క్లూజివ్​ ఇంటర్వ్యూలో మాట్లాడాడు పునియా.

Bajrang Punia w
భజరంగ్​ పునియా
భజరంగ్​ పునియా

వచ్చే ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్​లో బంగారు పతకాన్ని సాధించాలని తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపాడు రెజ్లర్ భజరంగ్ పునియా. 2008 బీజింగ్​లో జరిగిన విశ్వక్రీడల్లో భారత్​కు తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన షూటర్ అభినవ్​ బింద్రా విజయాన్ని తాను రిపీట్ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని 'ఈటీవీ-భారత్'​ ఎక్స్​క్లూజివ్​ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Bajrang Punia
భజరంగ్​ పునియా

ఒలింపిక్స్​లో రెండో వ్యక్తిగత స్వర్ణ పతకాన్ని మీరు సాధిస్తారని యావత్తు భారతదేశం మీపై ఆశలు పెట్టుకుంది. మీరేమంటారు?

దేశ ప్రజలంతా నాపై నమ్మకం పెట్టుకోవడం పట్ల ఎంతో గర్వంగా ఉంది. వారి ఆశలను నీరుగార్చను. 2008లో భారత్​ తరఫున అభినవ్​ బింద్రా తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించారు. అలానే నేను కూడా బంగారు పతకాన్ని సాధిస్తానని పూర్తి విశ్వాసం ఉంది.

Bajrang Punia
భజరంగ్​ పునియా

లాక్​డౌన్​ నిబంధనలు మీరు పాటిస్తున్నారా?

లాక్​డౌన్​లో నేను ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తున్నా. రెజ్లింగ్​ టోర్నీలు వాయిదా పడటం వల్ల ఇంటికే పరిమితమయ్యా. భౌతిక దూరం, మాస్క్​ ధరించడం వంటి స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నా.

ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్​ కోసం ఎలా సన్నద్ధమవుతున్నారు?

ఇంటివద్దనే ప్రాక్టీస్, కసరత్తులు చేస్తున్నా. నాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటున్నా. కాకపోతే ప్రాక్టీస్​ చేసేటప్పుడు ఓ భాగస్వామి ఉంటే బాగుండేది. క్యాంప్​లో భాగస్వామితో కలిసి ప్రాక్టీస్​ చేస్తుంటాను. కానీ ఇంటి వద్ద కుదరదుగా.

Bajrang Punia
భజరంగ్​ పునియా

మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏమిటి?

2013 ప్రపంచ ఛాంపియన్​షిప్​లో తొలిసారిగా పతకాన్ని సాధించినప్పుడు ఎంతో సంతోషించా. అప్పుడు నాకు 18 , 19ఏళ్లు ఉంటాయి.

మీ కెరీర్​లో స్వల్ప తేడాతో ఓడిపోయిన మ్యాచ్​ ఏమిటి?

2015 రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో నా ప్రత్యర్థి చేతిలో 12 సెకన్ల తేడాతో ఓడిపోయా. ఆ సంఘటన నేను మర్చిపోను.

మీ తల్లిదండ్రుల గురించి చెప్పగలరా?

నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇంత సాధించగలిగా. వారే నా తొలి గురువులు. మాది ఓ సాధారణ కుటుంబం. తండ్రి ఏ ఉద్యోగం చేయలేదు. ఆయనో రైతు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. కానీ నన్ను ఏ కొరత లేకుండా చూసుకునేవారు. నాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చేవారు.

Bajrang Punia
భజరంగ్​ పునియా

ఒలింపిక్స్​ వాయిదాపై మీ అభిప్రాయం ఏమిటి?

ఒలింపిక్స్​ వాయిదా పడటం మంచిదే. నా బలహీనతలపై దృష్టి పెట్టా. ఒకవేళ షెడ్యూల్​ ప్రకారం టోర్నీ నిర్వహించినా నేను సిద్ధంగానే ఉన్నా. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్​ గురించి ఆలోచించడం కన్నా కరోనాను ఎలా అంతమొందించాలి? అనే దానిపై దృష్టి సారించాలి.

Bajrang Punia
భజరంగ్​ పునియా

ఇది చూడండి : 'ఉత్తమ ఫ్రాంచైజీ అంటే చెన్నై సూపర్​ కింగ్స్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.