ETV Bharat / sports

వారి కోసం మళ్లీ బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగ్గజాలు

author img

By

Published : May 8, 2020, 9:27 AM IST

కరోనాపై పోరుకు ముందుకొచ్చాడు నాలుగు సార్లు ప్రపంచ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ ఇవాండర్‌ హోలీఫీల్డ్‌. 57ఏళ్ల వయసులో తిరిగి బాక్సింగ్​ రింగ్​లో అడుగుపెట్టనున్నాడు.

Evander Holyfield
హోలీఫీల్డ్

నాలుగుసార్లు ప్రపంచ హెవీవెయిట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్​గా నిలిచిన ఇవాండర్‌ హోలీఫీల్డ్.. 57 ఏళ్ల వయసులో‌ మళ్లీ బాక్సింగ్‌ రింగ్‌లో అడుగుపెడతానంటున్నాడు. కరోనా మహమ్మారిపై పోరుకు అండగా నిలవడం కోసం ఛారిటీ బౌట్​లో పాల్గొనున్నట్లు‌ తెలిపాడు. వైరస్​ వల్ల నిలిచిపోయిన చిన్నారుల విద్యాభ్యాసానికి తిరిగి ఊతమిచ్చేందుకే ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు.

"మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సమయం రాబోతుంది. ఛాంపియన్‌ తిరిగి బాక్సింగ్‌ ఆడనున్నాడు. ఓ మంచిపని కోసం ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో తలపడబోతున్నా"

- హోలీఫీల్డ్‌, ప్రపంచ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌

ఇప్పటికే దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌.. ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు సాధన మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య దాదాపు 20 ఏళ్ల తర్వాత పోరు జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : ఆకాశ్ 'ప్రపంచకప్​ ఎలెవన్​'లో ధోనీకి దక్కని స్థానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.