భారత స్టార్ మహిళా అథ్లెట్ ద్యుతి చంద్ తాత్కాలికంగా సస్పెన్షన్‌కు గురైంది. ఆమెకు నిర్వహించిన శాంపిల్- ఏ టెస్టు రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ ఆమెను తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
"వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీలో నిర్దేశించిన విధానానికి అనుగుణంగా మీ(ద్యుతి) మూత్ర నమూనాను జాతీయ డోప్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్ష చేయించాం. అందులో మీరు అండరైన్, ఓస్టారిన్, లిగాండ్రోల్ స్టెరాయిడ్స్‌ను తీసుకున్నట్లు తేలింది. అందుకు సంబంధించిన పూర్తి నివేదికలను మీకు పంపుతున్నాం. దాంతో పాటు క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన నివేదికలను జోడిస్తున్నాం. జాగ్రత్తగా చదవండి!"
- లేఖలో AAF
అయితే ఈ విషయంపై ద్యుతి చంద్ మరోలా స్పందించింది. తాను డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు తనకు తెలియదని చెప్పింది.
ఇక గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ద్యుతి చంద్ 200 మీటర్ల ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక 100 మీటర్ల ఫైనల్స్‌లో ఆరో స్థానంలో సరిపెట్టుకుంది. అంతకముందు 2018లో జరిగిన ఆసియా గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు సొంతం చేసుకుంది. ఇక 2013, 2017, 2019 ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు సాధించింది. ఇక 2019లో యునివర్సైడ్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించిన తొలి మహిళా స్ప్రింటర్‌గా రికార్డులకెక్కింది.