ETV Bharat / sports

దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్​ విజేతగా జెలేనా - దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్ 2022

Dubai Tennis Championships trophy: దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్ ఫైనల్​లో ​విజయం సాధించి ట్రోఫీని అందుకుంది ల్యాట్వియన్​ టెన్నిస్​ క్రీడాకారిణి జెలేనా ఒస్టాపెంకో. కెరీర్​లో ఇది ఆమెకు ఐదో టైటిల్​ కాగా.. ఈ విజయంతో ర్యాంకింగ్స్​లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

Dubai Tennis Championships trophy
దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్ విజేత
author img

By

Published : Feb 20, 2022, 12:53 PM IST

Dubai Tennis Championships trophy: దుబాయ్ టెన్నిస్​ ఛాంపియన్​షిప్​ ట్రోఫీని గెలుచుకుంది ల్యాట్వియన్​(యూరోప్​) టెన్నిస్​ ప్లేయర్​ జెలేనా ఒస్టాపెంకో. సింగిల్స్ విభాగంలో ​ ఫైనల్​లో వెరోనికాను(kudermetova) 6-0,6-4తేడాతో ఓడించి ఈ ట్రోఫీని దక్కించుకుంది. ఈ పోరు 65 నిమిషాల పాటు సాగింది. ఈ విజయంతో ర్యాంకింగ్స్​లో ఆమె నెం.21 నుంచి నెం.13కు చేరుకుంది. 2018 తర్వతా టాప్​-20 ర్యాంకింగ్స్​లో ఆమెకు స్థానం దక్కడం ఇదే తొలిసారి. కెరీర్​లో ఆమెకు ఇది ఐదో టైటిల్​.

"ఈ ట్రోఫీ వరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ వారం మొత్తం నేను చాలా బాగా ఆడాను అని భావిస్తున్నాను. మంచి విజయాలను అందుకున్నాను. ఈ రోజు కోసం చాలా కష్టపడ్డాను. నా దృష్టంతా ఈ మ్యాచ్​పైనే పెట్టాను." అని ట్రోఫీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది జెలేనా.

అంతకుముందు ఈ టోర్నీలో భాగంగా జరిగిన మిక్స్​డ్​ డబుల్స్​ ఫైనల్​లో ఉక్రెయిన్​కు చెందిన ఒస్టాపెంకో, కిచెనోక్(Kichenok) జోడీ చేతిలో 6-2, 2-6, 10-7 తేడాతో సానియా మీర్జా జోడీ పరాజయం చెందింది.

ఇదీ చూడండి: శ్రీలంకతో టెస్టు సిరీస్​.. ఎవరీ సౌరభ్​కుమార్​?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.