ETV Bharat / sports

'మెదడుపై నియంత్రణ ఉండాలంటే ధ్యానమే మార్గం' - పుల్లెల గోపీచంద్ ధ్యాన యాప్

విజయానికి పొంగిపోకుండా.. ఓటమికి కుంగిపోకుండా అన్నింటినీ సమంగా స్వీకరించేవాడే నిజమైన ఛాంపియన్‌ అంటున్నాడు జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌. ఇందుకు అత్యుత్తమ మార్గం ధ్యానమే అంటూ గోపీచంద్‌ చెబుతున్న విశేషాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

Dhyana app brings Pullela Gopichand as mental fitness trainer
ధ్యానమేవ జయతే: 'ధ్యానంతోనే మెదడుపై నియంత్రణ'
author img

By

Published : Dec 23, 2020, 9:38 AM IST

Updated : Dec 23, 2020, 11:05 AM IST

హోరాహోరీగా మ్యాచ్‌ జరుగుతుంది. ప్రత్యర్థి మెల్లిగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. శారీరకంగా ఓపిక, సామర్థ్యం ఉన్నా.. మానసికంగా ఏమాత్రం కుంగిపోయినా మ్యాచ్‌ను చేజారిపోవడం కొన్నిసార్లు చూస్తుంటాం! ఉత్కంఠభరిత పోరులో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధిస్తున్నా. ఒకటో, రెండో పాయింట్లు సాధిస్తే గెలిచినట్లే. ఈలోపే ఆలోచనలు హద్దులు దాటుతాయి. గెలుపు సంబరాల ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. ఈలోపు ప్రత్యర్థి పుంజుకుని మ్యాచ్‌ను లాగేసుకోవడం ఇంకొన్ని సార్లు గమనిస్తుంటాం! ఆటపై ఏకాగ్రత లేకపోవడం.. మెదడుపై నియంత్రణ లేకపోవడం వల్ల కలిగే దుష్పరిణామాలివి. అయితే మన మెదడు మన నియంత్రణలో ఉండటానికి ధ్యానమే అత్యుత్తమ మార్గం అని అంటున్నాడు జాతీయ బ్యాట్మింటన్​ ప్రధాన కోచ్​ పుల్లెల గోపీచంద్​. ధ్యానం గురించి ఆయన చెప్పిన విశేషాలేంటో తెలుసుకుందాం.

ధ్యానం ఎందుకు?

విశాల దృక్పథంలో చూస్తే ఆడేటప్పుడు వచ్చే ఆలోచనల్లో స్పష్టత ఉండటం మంచిది. మరో కోణంలో ఆలోచనలు లేకపోతే మరీ మంచిది. మ్యాచ్‌లో ఎలా ఆడాలన్న ఆలోచనలు ఉండటం.. రావడం విశాల దృక్పథం. అసలు ఏమాత్రం ఆలోచనలు లేకుండా ఆడటం అత్యుత్తమ మార్గం. దాన్నే క్రీడల్లో 'జోన్‌' అంటారు. ఆ జోన్‌లోకి వెళ్లడానికి అత్యంత ముఖ్యమైన టెక్నిక్‌.. ధ్యానం.

క్రీడల్లో ప్రతికూల, అతి సానుకూల ఆలోచనలు రెండూ మంచివి కావు. ఇలాంటి ఆలోచనలు రాకుండా మెదడును కుదురుగా ఉంచేదే ధ్యానం. ఒక పిల్లాడు పదో తరగతి తప్పితే అతడి ఇల్లు, కుటుంబం, బంధువుల వరకే తెలుస్తుంది. ఒక క్రీడాకారుడు ఓడిపోతే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ పరిణామం క్రీడాకారుల్లో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తుంది. వాళ్లు నైరాశ్యంలోకి వెళ్లిపోతారు. ప్రతికూలమైనవే కాదు.. అతి సానుకూల ఆలోచనలు వచ్చినా కష్టమే. మ్యాచ్‌ ముగియక ముందే చాలామంది భవిష్యత్తులోకి వెళ్లిపోతారు. గెలుపు తర్వాత ఏం చేయాలనే ఊహల్లోకి వెళ్లిపోతారు. ఈలోపు మ్యాచ్‌ను సరిగా ముగించడం మరిచిపోతారు. ఆ క్షణంలో పూర్తి ఏకాగ్రతతో ఉండటం అత్యంత ముఖ్యం. ఇందుకు ధ్యానం దోహద పడుతుంది.

ధ్యాన యంత్రం

ధ్యానంలో ముఖ్యమైనది ఏకాగ్రత. ప్రతిరోజూ ఎంతోమంది ధ్యానం చేస్తుండటం చూస్తుంటాం. కానీ ఎంత మంది సరిగా చేస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. ప్రతి ఒక్కరు కూర్చుంటారు.. గుండె లేదా నుదురు లేదా నాభి మీద ఏకాగ్రత నిలిపి ధ్యానం చేస్తుంటారు. ధ్యానం సరిగా చేస్తున్నారా? లేదా? ఎంత మంది నూటికి నూరుశాతం ధ్యానం చేస్తున్నారు? చేసిన ధ్యానంతో ఎంత ఫలితం దక్కిందన్న విషయాల్ని తెలుసుకునే పరికరం లేదు. ధ్యానం తీవ్రత, ఏకాగ్రత, ఫలితం కొలిచే పరికరమే.. ధ్యాన.

సాధారణ వ్యక్తులు, క్రీడాకారులు సరైన విధంగా ధ్యానం చేస్తున్నారా? అన్నది అతిపెద్ద సమస్య. వారందరికీ 'ధ్యాన యాప్‌' ఉపయోగపడుతుంది. యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉంగరం మాదిరిగా ఉండే పరికరం కొనుక్కోవాలి. ఇది ధ్యానం తీవ్రత, ఏకాగ్రత, ఫలితాన్ని కొలుస్తుంది. ధ్యానం నాణ్యతను అంచనా వేస్తుంది. కొత్తవాళ్లు ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. ఏకాగ్రత తక్కువ ఉన్నవాళ్లు ఎలా పెంచుకోవాలో అవగాహన వస్తుంది. మరింత తీవ్రత, ఏకాగ్రతతో ధ్యానం చేసుకోవచ్చు. ధ్యాన యాప్‌ ద్వారా మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాం? ఎంత మెరుగవ్వాలి? అనే విషయాలు తెలుస్తాయి.

భవిష్యత్తులో అవసరం

ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో మాననిక ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. శ్వాస సంబంధ కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతమంది ధ్యానం చేస్తున్నారన్నది అటుంచితే.. భవిష్యత్తులో మెడిటేషన్‌ ప్రతి ఒక్కరికి అవసరంగా మారిపోతుంది. రోజురోజుకూ ఆలోచనల్లో కాలుష్యం/కల్తీ పెరిగిపోతోంది. మనసు, మెదడుపై నియంత్రణ తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధ్యానం చాలా అవసరం. ధ్యానాన్ని నూటికి నూరశాతం సరిగా చేయడం అత్యంత ముఖ్యం.

ఇదీ చూడండి: వచ్చే ఏడాది ఐపీఎల్​ మెగావేలం లేనట్టే

Last Updated : Dec 23, 2020, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.